Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్‌కు లగ్జరీ వాచ్ బహుమతి.. ఖరీదు ఎన్ని కోట్లుంటే..!
- భారత్‌లో ముగిసిన లియోనెల్ మెస్సీ టూర్
- వంతారాను సందర్శించిన ఫుట్‌బాల్ లెజెండ్
- లగ్జరీ వాచ్ బహుమతిగా ఇచ్చిన అనంత్ అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటించారు. కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో పర్యటించారు. చివరిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూడా పర్యటించారు. అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శంగా మెస్సీకి అనంత్ అంబానీ ప్రత్యేక కానుక అందించారు. రిచర్డ్ మిల్లె లగ్జరీ వాచ్‌ను బహుకరించారు. దాదాపు దీని ఖరీదు రూ.11 కోట్లు ఉంటుందని అంచనా.

Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
రిచర్డ్ మిల్లె గడియారం ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే వాచ్‌లో ఒకటి. ఈ వాచ్ అత్యంత ప్రత్యేకమైంది. RM 003-V2 GMT అనేది రిచర్డ్ మిల్లె మోడళ్లలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది. వంతారా సందర్శనకు వచ్చినప్పుడు మెస్సీ చేతికి ఎలాంటి వాచ్ లేదు. తిరిగి వెళ్లిపోతుండగా చేతికి RM 003-V2 వాచ్ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గడియారంలో అత్యంత అద్భుతమైన లక్షణాలుంటాయి.

ఈ ప్రత్యేకమైన రిచర్డ్ మిల్లె టైమ్‌పీస్ ప్రస్తుతం బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా, ఫార్ములా 1 డ్రైవర్ మిక్ షూమేకర్, మాజీ ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు, ఫెరారీ జట్టు ప్రిన్సిపాల్ జీన్ టాడ్డ్ వంటి ప్రముఖులు ధరిస్తున్నారు. అలాగే జోహోర్ క్రౌన్ ప్రిన్స్ తుంకు ఇస్మాయిల్ ఇబ్ని సుల్తాన్ ఇబ్రహీం, వాచ్‌మేకర్ కరి వౌటిలైనెన్ కూడా ధరిస్తున్నారు. ఇప్పుడు అంత ఖరీదైన వాచ్‌ను మెస్సీ ధరించాడు.

ఇక పర్యటన ముగించుకుని వెళ్తుండగా భారత ప్రజల ప్రేమ, ఆప్యాయతకు మెస్సీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నమస్తే ఇండియా! ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాకు ఎంత అద్భుతమైన సందర్శనలు. నా పర్యటన అంతటా ఆత్మీయ స్వాగతం. గొప్ప ఆతిథ్యం, ప్రేమకు ధన్యవాదాలు. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను!’’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!