హైదరాబాద్ ఏవిధంగా అభివృద్ధి జరిగిందో.. ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. టెక్నాలజీ మన జీవితంలో భాగంగా మారుతుందన్నారు. ‘వికసిత్ భారత్’ అనేది ప్రధాని మోడీ లక్ష్యం అని, అలాగే ‘స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్’ అనేది మన లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రోగ్రామ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
‘ఫిక్కి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. సంఘంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండే సంస్థ ఫిక్కి. దావోస్‌కి వెళ్లి పారిశ్రామికులని కలవడం జరిగింది. అక్కడ అంతా పెద్ద వారే కాదు, పొలిటిషియన్స్ అందరు కలుసుకుని ఒక గొప్ప అవకాశాన్ని పొందే ప్రదేశం. 1991 ముందు 1991 తర్వాత రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. కాంపిటీటివ్ ఎకానమీలో మనం ముందుకి వెళ్తున్నాము. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం ఆర్థిక వ్యవస్థలో ముందుంటుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే 11సంవత్సరాల నుంచి దేశం ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ఐటీ సంస్థ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగడుతుంది. ముందు ముందు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల డ్రోన్స్ అభివృద్ధితో మానవాళికి అనేక రకాలైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంగ్లీషు మరియు మేథ్స్ ఐటీకి అత్యంత ముఖ్యమైన సబ్జెక్ట్స్’ అని సీఎం అన్నారు.
Also Read: Shubhanshu Shukla: కుమారుడు రోదసిలోకి వెళ్తుండగా భావోద్వేగానికి గురైన శుభాంశు శుక్లా తల్లి
‘టెక్నాలజీ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ముందు ముందు టెక్నాలజీతో మనం డ్రైవింగ్ చేసే విధానాన్ని సైతం కనిపెట్టగలం.డ్రోన్స్‌తో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేసే విధంగా అభివృద్ధి అయ్యింది. భారత దేశంలో చాలా మంది లెక్కల్లో మేధావులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు తెలుగు వారు. ప్రపంచంలోనే మైక్రోసాఫ్ట్ ఒక పెద్ద సంస్థ. మనకు ఆధార్ అనేది ఒక గుర్తింపు అయ్యింది. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్, నాలెడ్జితో ఎన్నో అద్భుతాలు చేయచ్చు. వికసిత్ భారత్ అనేది ప్రధాని మోడీ లక్ష్యం. అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ అనేది మన లక్ష్యం. రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు రానున్నాయి. హైదరాబాద్ ఏవిధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతి ని అభివృద్ధి చేస్తాము’ అని సీఎం చెప్పుకొచ్చారు.