ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు పెట్టింది. దాంతో కొనుగోలు దారులు గోల్డ్ కొనాలంటేనే భయపడిపోయారు. అయితే గోల్డ్ రేట్లు మూడు రోజుల నుంచి దిగివస్తూ కాస్త ఊరటనిస్తున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.270.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.250 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జూన్ 25) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,950గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,700గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,700గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,950గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.90,850గా.. 24 క్యారెట్ల ధర రూ.99,100గా నమోదైంది. ప్రాంతాల వారీగా పసిడి ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి తులం బంగారం ధర మరింత ఎక్కువగా ఉంటుంది.
Also Read: Beautician Anusha: కుటుంబ కలహలు.. మనస్తాపంతో ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య.!
మరోవైపు వెండి ధర కూడా ఊరటనిస్తోంది. ఇటీవల స్థిరంగా ఉన్న వెండి.. రెండు రోజులుగా తగ్గుతోంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై వెయ్యి తగ్గి.. రూ.1,08,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 18 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్ష 8 వేలుగా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన ధరలు ఇవి.