తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం కమ్మేస్తోంది. బ్రేక్ మాన్ సూన్ తరహా వాతావరణం కలవరపాటుకు గురిచేస్తోంది. సీజన్లో అత్యంత కీలకమైన జూలై తీవ్ర నిరాశపరిచింది. ఇప్పటికే 10 శాతం వర్షపాతం లోటు నమోదవ్వగా.. వచ్చే వారం పది రోజులు చాలా కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈలోగా వర్షాలు కురిసి సాధారణ స్ధితికి రాకపోతే పంటలు దెబ్బతినే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఈ ఏడాది 9 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినప్పటికీ రైతులకు అవసరం అయిన సమయంలో […]
సినిమా డైలాగ్లు పోస్టర్లుగా పెట్టినందుకు కార్యకర్తలపై కేసులు పెట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. నటులు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్లు ఎక్కువ ఉంటాయని.. మీకు అభ్యంతరాలు ఉంటే సెన్సార్ వాళ్లకు చెప్పి తీయించాలన్నారు. అసలు సెన్సార్ వాళ్లకు లేని అభ్యంతరం మీకు ఎందుకు? అని ప్రశ్నించారు. మంచి సినిమాలోని పాటలు పెట్టుకున్నా తప్పే.. డైలాగులు పెట్టుకున్నా తప్పే.. ఇలా అన్నా తప్పే, అలా అన్నా తప్పే.. ఏం చేసినా తప్పేనా? […]
తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత అన్నీ చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని తమపై అబాండాలేశారని, సీఎం చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్షా 75 వేల కోట్లు అప్పులు చేశారని […]
ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం […]
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ మార్కెట్లో అయినా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వర్షాలు లేక, పంటలు దిగుబడి లేకపోవడంతో.. మార్కెట్లో పచ్చి మిరప నిండుకున్నాయి. టమోటా, అలసంద, బెండ, కాకర, బీర, చిక్కుడు, వంకాయ వంటి కూరగాయలు అర్థ సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. ప్రస్తుతం సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. జులై నెల వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో.. ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడుతోంది. మార్కెట్లో దాదాపుగా అన్ని […]
జనగామ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ.. ఓ తల్లి రోడ్డు పక్కన పసికందును వదిలేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు.. స్నానం పోసి అక్కున చేర్చుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ బిడ్డ తల్లిదండ్రులు కనిపించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముక్కు పచ్చలారని పసికందును బహిరంగ ప్రదేశంలో వదిలేసిన ఘటన జిల్లాలో ఇప్పుడు కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం… జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో […]
వైష్ణవి హత్య కేసులో వీడని సస్పెన్స్: కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో సస్పెన్స్ ఇంకా వీడలేదు. విద్యార్థిని హత్యపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం (జులై 14) ఉదయం 8.30 గంటలకు గండికోటకు చేరుకున్న వైష్ణవి, లోకేశ్.. 10:40 గంటలకు లోకేశ్ ఒక్కడే తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైష్ణవి హత్య జరిగినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హత్య […]
Inter Student Vaishnavi murder in Gandikota: కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో సస్పెన్స్ ఇంకా వీడలేదు. విద్యార్థిని హత్యపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం (జులై 14) ఉదయం 8.30 గంటలకు గండికోటకు చేరుకున్న వైష్ణవి, లోకేశ్.. 10:40 గంటలకు లోకేశ్ ఒక్కడే తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైష్ణవి హత్య జరిగినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. […]
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జల శక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సమావేశ ఎజెండాలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశం పక్కన పెట్టాలని […]
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్లో పాల్గొననున్నారు. కీలక ప్రెస్మీట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజాగా జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే? రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు, అక్రమ అరెస్టులు, తన పర్యటనలపై ఆంక్షలు సహా తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ […]