తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ మార్కెట్‌లో అయినా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వర్షాలు లేక, పంటలు దిగుబడి లేకపోవడంతో.. మార్కెట్‌లో పచ్చి మిరప నిండుకున్నాయి. టమోటా, అలసంద, బెండ, కాకర, బీర, చిక్కుడు, వంకాయ వంటి కూరగాయలు అర్థ సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. ప్రస్తుతం సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
జులై నెల వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో.. ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడుతోంది. మార్కెట్‌లో దాదాపుగా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు నెల రోజుల్లోనే బాగా పెరిగాయి. వంగ, బెండ, దొండ, మిర్చి, టమోటా ధరలు దాదాపుగా 4 నుంచి 5 రూపాయలు పెరిగింది. ఇక ఇంగ్లిష్ కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. క్యారెట్, క్యాప్సికం, బీన్స్, బీట్ రూట్ ధరలు భారీగా పెరిగాయి. బీన్స్, క్యాప్సికం కిలో 95కి చేరుకుని సెంచరీకి దగ్గర్లో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం పెరిగాయి.
Also Read: Crime News: జనగామ జిల్లాలో పసికందు కలకలం.. స్నానం పోసి అక్కున చేర్చుకున్న గ్రామస్థులు!
తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో 30 శాతం మేర పంటల సాగు తగ్గింది. డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్‌కు కూరగాయలు రాకపోవడంతో.. జూన్ మాసంలోనే ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక జులై నెలలో మరింత మండుతున్నాయి. మన దగ్గర సాగు తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.