పార్టీ మారిన ఆ ఆరుగురు ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ వ్యూహామేంటి? వారి మీద అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తుందా? లైట్ తీసుకుంటుందా? 15 నెలలుగా తమ రాజీనామాల విషయంలో ఎటు తేల్చటం లేదంటూ కోర్టు వరకు వెళ్లిన ఎమ్మెల్సీలకు వైసీపీ వ్యూహం అంతుపట్టడం లేదా?వీరి విషయంలో జగన్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతోంది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ పరిమితం కావటంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. హోదా లేకుంటే సభలో మాట్లాడేందుకు సమయం […]
హైదరాబాద్ నగరంలో విపత్తులను ఎదుర్కోవడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడడం, ఆస్తులను కాపాడడం వంటి ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కు ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది.
తానొకటి తలిస్తే… జరిగేది మరొకటి అన్నట్లు ఉందట ఆ ఎమ్మెల్యే పరిస్థితి. ప్రాంత అభివృద్ధి ఎజెండాగా వేసిన అడుగులు… సత్ఫలితలివ్వక పోగా కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయట. ప్రభుత్వ పెద్దల తీరుతో ఆ ఎమ్మెల్యే మాట్లాడిన నైరాశ్యపు మాటలు … ఆయన అసంతృప్తికి అద్దం పడుతున్నా యని చర్చించుకుంటున్నారు.ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..?ఎరక్కపోయి..ఇరుక్కుపోయారా?అసలేం జరిగింది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరోసారి గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మారిన రాజకీయ […]
దిల్సుఖ్నగర్ కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ వరుంధ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్లు బి. నరసింహ రెడ్డి, బి. ఆషుతోష్ రెడ్డి ప్రారంభించారు. హబ్సిగూడలో తొలి బ్రాంచ్‌తో విజయవంతంగా కొనసాగుతున్న వరుంధ షాపింగ్ మాల్, ఇప్పుడు కొత్తపేటలో రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ షాపింగ్ మాల్ ముకుంద జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దసరా పండుగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్‌గా అక్టోబర్ 2 వరకు 5000 రూపాయల పైగా షాపింగ్ చేసిన […]
కాపీరైట్ కేసులో ఊరట గ్రామీ, ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. 2023లో మణి రత్నం డైరెక్టర్‌గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాలోని ‘వీర రాజా వీర’ పాటపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జస్టిస్‌లు సి. హరి శంకర్, ఓం ప్రకాశ్ శుక్లా ఉన్న ఈ బెంచ్, రహ్మాన్ అప్పీల్‌ను అనుమతించడంతో పాటు, […]
పాట్నా లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ کمیటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రధాన ప్రసంగం చేశారు.
సిక్కోలు ప్రాంతంలో మరో థర్మల్ పోరాటం ఊపందుకుంటుందా? గిరిజన ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష వైసీపీ మద్దతుగా నిలుస్తుందా? కానీ ఈ థర్మల్ పోరాటంలో ఆ జిల్లా వైసీపీ బడా నేతలు ఇరకాటం లో పడ్డారా? ఇంతకీ ఎవరా నేతలు..?ఎంటా ఇబ్బందులు..? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ధర్మాన సోదరులు , తమ్మినేని సీతారాం పాత్ర సుస్పష్టం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారంట. దానికి ప్రధాన కారణం ఆమదాలవలస […]
నాగోల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళకు సంబంధించిన ఘట్టం స్థానికులకు భయంకరమైన ఉదంతంగా మారింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా రెడ్యాల నుంచి వచ్చిన ఒక మహిళకు సంబంధించినది.
తెలంగాణ వ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇస్తున్నారు. ఈ టైంలో ఆ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో పాటు…వాళ్లపై కంప్లయింట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారట. అసలు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పుడు వాళ్లకొచ్చిన ఆ కష్టమేంటి? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్ల దగ్గర నుంచి వివరాలు […]
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో జరుగుతున్న దుర్గ మాత నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అమ్మవారికి నైవేద్యం కోసం పాయసం తయారు చేస్తుండగా, బెల్లంలో నిషేధిత పొగాకు ప్యాకెట్ (అంబర్) బయటపడటంతో భక్తులు