ఆ ఎమ్మెల్యేను వదల బొమ్మాలి అంటూ ఆ మహిళా నేత వెంటాడుతోందా? ఇప్పటికే టీజర్ చూపించిన అమె… ఇప్పుడు ట్రైలర్ సైతం వదలడంతో ఆ నియోజకవర్గ కూటమి నేతల్లో హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయా?ఇప్పుడే ఇలా ఉంటే త్వరలోనే అసలు సినిమా చూపిస్తానంటూ ఆమె చెప్పడం వెనుక అంతర్యమెంటి? ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరగబోతోంది..వదల బొమ్మాలి అంటూ ఆ ఎమ్మెల్యేను వెంటాడుతున్న ఆ మహిళ నేత ఎవరు? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పుడు […]
తెలుగు రాష్ట్రాలను వరస వర్షాలు విడవకుండా襲ిస్తున్నాయి. గ్యాప్‌ల వారీగా విరుచుకుపడుతున్న వర్షాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా వాయుగుండం ముప్పు ముంచుకొస్తుందని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను అణిచివేయడంలో భాగంగా సిట్–సీఐడీ భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి ఎనిమిది మంది ఆపరేటర్లను అరెస్ట్ చేసింది.
రాష్ట్ర హోదా కల్పించాలని లడఖ్‌లో నిరసనలు.. బీజేపీ ఆఫీస్ దగ్ధం రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. అలాగే బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం లడఖ్‌లోని లేహ్ […]
నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో బాదడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్లపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలపై ఈ పిటిషన్లు వేశారని ప్రశ్నించింది.
ఆ నాయకుడికి టికెట్ చేజారిపోయిందా?నామినేటెడ్ పదవి వద్దనుకున్నారా? చివరకు ఆయనకు దక్కింది ఏమిటి? సొంత నియోజకవర్గంలో పదవులు వదులుకుని, పక్క నియోజకవర్గంలో ఇల్లీగల్ వ్యాపారం ఎంచుకోవడానికి కారణమెంటి? అక్రమ వ్యాపారం లాభసాటిగా సాగడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూనే… గతంలో పార్టీ కోసం ఖర్చు చేసిన. డబ్బులు రాబట్టుకుంటున్నారా? టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇసుకాసురుడిగా. మారారట. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల ఇసుక స్టాక్ పాయింట్‌కు కుందుల కింగ్ మేకర్. […]
త్యాగాలు చేసిన పార్టీ.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాటాలు నడిపిన పార్టీ.. ప్రజా ఉద్యమాల కోసం ప్రాణాలను ప్రాణంగా పెట్టిన పార్టీ ..ఒక మాట చెప్తే కట్టుబడి ఉండే కార్యకర్తలు. అగ్ర నాయకుడు ఏం చెప్తే దానికే కట్టుబడి ఉంటారు.. తిరిగి ప్రశ్నించే దాఖలాలు కూడా ఉండవు.. క్రమశిక్షణకు మారుపేరైన మావోయిస్టు పార్టీలో ఇప్పుడు లుకలుకలు బయట పడుతున్నాయి.. మావోయిస్టు పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అంతేకాదు బహిరంగ పగడంలు ఇచ్చుకునే […]
ప్రగతి స్టేడియంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. భారీ వర్షం వచ్చినప్పటికైనా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు కవిత స్వాగతం తెలియజేసారు.