Vakiti Srihari : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఎన్టీవీతో మాట్లాడుతూ ఈ గెలుపు పూర్తిగా ప్రజలది, ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టమైందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ విజయం మరోసారి నిరూపించిందని, ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకునేలా పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 పోస్టులు.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి
బీజేపీ, బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మలేదని, వారి మాటలు గ్లోబల్ ప్రచారంలా మాత్రమే మిగిలిపోయాయని మంత్రి చెప్పారు. అభివృద్ధికి పట్టం కట్టిన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇచ్చారని తెలిపారు. స్థానిక సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నవీన్ యాదవ్‌ను గతంలో ప్రాంత అభివృద్ధికి మార్గదర్శకుడైన పీజేఆర్ లాగా తీర్చిదిద్దుతామని శ్రీహరి అన్నారు. జూబ్లీహిల్స్‌లో గత ప్రభుత్వాలు చేయలేని అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నవీన్ ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి పకడ్బందీ ప్రణాళికతో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులు వేగంగా సాగాయని, ఈ ఎన్నికలో ప్రజలే నిజమైన విజేతలని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు.
Ayyannapatrudu: పదవులు, అధికారం శాశ్వతం కాదు.. మంత్రికి స్పీకర్ చురకలు!