మన దేశం అన్ని మతాలు, సంస్కృతులు కలసి సహజీవనం చేస్తూ ప్రపంచానికి స్ఫూర్తినిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద శనివారం నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Parineetichopra : తల్లి అయిన స్టార్ హీరోయిన్.. మహేశ్ బాబు హీరోయిన్ ఖుషీ సీఎం […]
నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు..? నెల్లూరు జిల్లా రాళ్లపాడులో జరిగిన హత్యాయత్నం ఘటనలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో జరిగింది ఒక మారణఖండగా చెప్పవచ్చు అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు మీద ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారు అని ఆరోపించారు. ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు […]
Ganja Batch : హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో శనివారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. చంద్రయాన్ గుట్ట ఏరియాలోని ASIపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులే ముప్పతిప్పలు పడేలా ఆ గంజాయి బ్యాచ్ ప్రవర్తించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ ప్రాంతంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అర్ధరాత్రి సమయంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. గాయపడ్డ వారు రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తుండటంతో […]
Constable Murder : తెలంగాణలో సంచలనం రేపిన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పోలీసులు కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ హత్యకు ప్రధాన నిందితుడైన షేక్ రియాజ్ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. సారంగాపూర్ సమీపంలో రియాజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. Deputy CM Pawan: హ్యాపీ దీపావళి.. నయా నరకాసురులను ఎన్నికల్లో ప్రజలు ఓడించారు.. పోలీసులు రియాజ్ […]
CM Revanth Reddy : రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే రైతులు లాభపడే విధంగా పాలన సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళావేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు సర్టిఫికెట్లు, లైసెన్సులు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ కాదు.. పండగ కావాలన్నారు. రైతు లాభపడాలి.. రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యుడికి అన్యాయం చేసినట్టే అవుతుంది అని అన్నారు. Protest: ఇంటిని శుభ్రం […]
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం భారత ఎన్నికల కమిషన్కు 40 మంది ప్రముఖ నేతల పేర్లను పంపారు. ఈ జాబితాలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత పీ. విశ్వనాథ్, […]
Tragedy : అమెరికాలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నివాసులు తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ విషాద వార్తతో మంచిర్యాల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల రెడ్డి కాలనీలో నివసించే విశ్రాంత సింగరేణి కార్మికుడు పి.విఘ్నేష్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. విఘ్నేష్ దంపతులకు స్రవంతి, తేజస్వి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల తేజస్వి గృహప్రవేశం సందర్భంగా గత నెల 18న […]
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు ఎదురవుతున్న ఇబ్బందులు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. మొగులయ్యకు ఇంటి స్థల సమస్యతో పాటు కంటి చికిత్స బాధ్యతను కూడా స్వయంగా తీసుకుంటానని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు.
శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం.. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ‘‘దీపావళి’’ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దీపావళికి సంబంధించి కొత్త బట్టలు, టపాసులు, ఇతరత్రా షాపింగ్ జోరుగా సాగుతోంది. తమ కుటుంబాలతో ఆనందంగా పండగను సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామం, గ్రామ ప్రజలు శతాబ్ధాలుగా దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామం ఎన్నో […]