ప్రకృతిని.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అక్కాచెల్లెళ్లందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉంది సీఎం తీరు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ కడతామని […]
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ప్రేమ వ్యవహారం దారుణానికి దారితీసింది. గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్ (25)ను, అతని ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, పలువురు కీలక అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పటివరకు పనిచేసిన వీసీ సజ్జనార్, తన పదవీకాలంలో చివరి రోజును సాధారణ ప్రజల మాదిరిగానే గడిపారు.
దుబాయ్లోని రింగ్ ఆఫ్ ఫైర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హై ఓల్టేజ్ మ్యాచ్లో ప్రత్యర్థి పాకిస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఆసియాకప్ 2025 విజేతగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బస్ డిపోలు నిర్మాణం, పాత బస్ స్టేషన్ల పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.108.02 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది.
గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్ తమిళనాడులోని కరూర్ లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే 40 మంది దాకా చనిపోయారు. ఇంకా పదులకొద్దీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటనపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమిళనాడు అగ్ర హీరోలు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై కమల్ స్పందిస్తూ.. కరూర్ తొక్కిసలాట గురించి విని నా గుండె వణికిపోయింది. ఆ […]
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని బతుకమ్మకుంటను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి బతుకమ్మను వదిలి, గంగమ్మకు చీర, సారెను సమర్పిస్తూ పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. బతుకమ్మకుంటకు రూ.7.40 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేసిన హైడ్రా సంస్థకు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, “బతుకమ్మకుంట అభివృద్ధికి హనుమంతరావు ఒక జీవితసాధనగా పోరాటం చేశాడు. ఆయన ప్రయత్నాలు గుర్తుంచుకోవాల్సినవి. అందువల్ల బతుకమ్మకుంటకు ఆయన పేరును […]
కొత్తగా నియమితులైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ తన ప్రాధాన్యతలు, విధానాలను స్పష్టంగా వెల్లడించారు. ఎన్ టివి తో మాట్లాడిన ఆయన, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన పాక్ కు భారత బౌలర్లు చెమటలు పట్టించారు. మెరుపు బౌలింగ్ తో విరుచుకుపడి పాక్ నడ్డివిరిచారు. పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుణ్ చక్రవర్తి 02, అక్షర్ పటేల్ […]