ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదేనా !
నేడు జరిగిన స్పిరిట్ మూవీ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈవెంట్ ఫొటోల్లో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అది రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించకపోవడం. సాధారణంగా ఇలాంటి కీలక ఈవెంట్లకు ఆయన వచ్చినప్పుడు ఫొటోలు బయటకు రావడం కామన్. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో ప్రభాస్ రాలేదని అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఈవెంట్‌కు వచ్చాడు. ముహూర్తం షాట్ కూడా కొట్టాడు.
పాకిస్థాన్‌పై విరుచుకుపడిన ఫ్రాన్స్.. ‘రాఫెల్‌పై పాక్ ప్రకటనలు అబద్ధం’
భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌ను తునాతునకలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్థాన్ చరిత్రలో ఒక్కసారి కూడా కలని కల. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ పాకిస్థాన్‌ను కొలుకోలేని షాక్‌కు గురి చేసిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో నాటి నుంచి కూడా దాయాది దేశం ఆపరేషన్ సింధూర్ గురించి అబద్ధాలు చెబుతూనే ఉంది. దేశంలో జరిగిన విధ్వంసాన్ని దాచుకోలేక, పాకిస్థాన్ ప్రతిచోటా కూడా భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ విమానాలను కూల్చివేసినట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఫ్రాన్స్ స్వయంగా పాకిస్థాన్ పోరాట శైలికి ప్రశంసించిందనే కథనంతో దాయాది దేశం వివిధ కల్పిత కథలను అల్లింది. తాజాగా ఈ కల్పిత కథలపై ఫ్రాన్స్ విరుచుకుపడింది.
వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్..
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టను ఈ రోజు ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఈ టీంకు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో జట్టు నాయకత్వ బాధ్యతను సెలక్షన్ కమిటీ రాహుల్‌కు అప్పగించింది. కోల్‌కతా టెస్ట్‌లో జట్టు కెప్టెన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే వైస్ కెప్టెన్ అయ్యర్ గాయపడి నాటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.
భార్యతో వివాదం..కొడుకు పేరుతో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన హీరో
ఈ మధ్యకాలంలో, హీరో ధర్మ మహేష్ అతని భార్య గౌతమి చౌదరి వరుసగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హీరో ధర్మ మహేష్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి, ఈ జంట ఇద్దరూ కలిసి గిస్మత్ జైల్ మందీ అనే పేరుతో హైదరాబాద్ వ్యాప్తంగా రెస్టారెంట్స్‌ను నడిపేవారు. వివాదాల నేపథ్యంలో, ఆ బ్రాండ్ తనదంటే తనదని ఒకరికొకరు క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా, Gismat పేరుతో మొన్నటి వరకు నడిచిన రెస్టారెంట్‌ను పేరు మార్చి Jismat గా ఈరోజు ప్రారంభించారు. తన కుమారుడు జగద్వజ పేరు మీద ఈ రెస్టారెంట్ మారుస్తున్నట్లుగా హీరో ధర్మ మహేష్ వెల్లడించాడు.
తప్పుగా అర్థం చేసుకున్నారు.. కాంట్రవర్సీపై బ్రహ్మానందం క్లారిటీ
బ్రహ్మానందం మీద నిన్నటి నుంచి ఒక కాంట్రవర్సీ మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో నడుస్తోంది. మంచు మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కు బ్రహ్మానందం వెళ్లారు. అయితే బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈవెంట్ లో బ్రహ్మానందం ను కలిశారు. ఒక ఫొటో దిగుదాం రా అన్నా అంటూ బ్రహ్మానందం చేతు పట్టుకుని అడుగుతున్నా.. ఏ వద్దు ఇప్పుడు అంటూ బ్రహ్మానందం వెళ్లిపోయారు. దీంతో ఈ వీడియో కాస్త వివాదానికి దారి తీసింది. బ్రహ్మానందం ఒక మాజీ మంత్రిని అవమానించాడు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. బ్రహ్మానందం ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఢిల్లీలో రూ.200 కోట్ల డ్రగ్స్ సీజ్..
దేశ రాజధాని ఢిల్లీలో రూ.200 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను ఒక ప్రధాన ఆపరేషన్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్ ఒక ఫామ్‌హౌస్‌పై దాడితో ప్రారంభమైందని, అక్కడ లభించిన కీలకమైన ఆధారాల ఆధారంగా, NCB మూడు రోజుల ఆపరేషన్ నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఒక ప్రధాన అంతర్జాతీయ సింథటిక్ డ్రగ్ నెట్‌వర్క్‌ను గుర్తించిందని వెల్లడించారు. దర్యాప్తులో ఈ ముఠా మొత్తం విదేశీయుల ఆధ్వర్యంలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఫామ్‌హౌస్ దాడి తర్వాత ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లోని అనేక ప్రదేశాలలో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు, అలాగే అనుమానితుల కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఏలూరు పర్యటనలో స్వల్ప మార్పు..
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు (సోమవారం) ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన హెలికాప్టర్ ద్వారా రావాలని యోచించిన ముందస్తు ప్రణాళికను రద్దు చేసి, రోడ్డు మార్గాన పర్యటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, యర్రంపేట, రాజవరం మీదుగా ఐ.ఎస్. జగన్నాధపురం గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తరువాత గ్రామంలో ఉన్న 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయడంతో పాటు, దేవాలయానికి నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
పంట ధరలు రికార్డు స్థాయిలో పతనమైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. రైతుల్ని రోడ్డున పడేశారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చంద్రబాబూ.. రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా మీరు రైతులవైపు కన్నెత్తి చూడ్డం లేదంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరాలేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకు వచ్చారని ఆయన అన్నారు. అంతేకాకుండా..’చంద్రబాబూ.. ఇలా మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్న చొక్కానుకూడా తీసివేసి వారిని రోడ్డుమీద నిలబెట్టి, ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ వారికి ఎండమావులు చూపిస్తారా? రైతుల కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీనిమీద చర్చజరగకుండా వాటికి ముసుగు వేసి మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే.. రైతన్నా.. మీకోసం..
దౌత్యపరమైన వివాదంతో ముగిసిన జీ-20 సమావేశం
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం దౌత్యపరమైన వివాదంతో ముగిసింది. అమెరికా ఈ శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించి, తన రాయబార కార్యాలయం నుంచి ఒకే ఒక దౌత్యవేత్తను శిఖరాగ్ర సమావేశానికి పంపింది. ఈక్రమంలో దక్షిణాఫ్రికా G20 అధ్యక్ష పదవిని అమెరికా ప్రతినిధికి అప్పగించడానికి నిరాకరించి, సమావేశానికి అమెరికా పంపించిన ప్రతినిధి తక్కువ స్థాయి వ్యక్తి అని అభివర్ణించింది. ప్రతి శిఖరాగ్ర సమావేశం ముగింపులో అధ్యక్ష పదవిని తదుపరి దేశానికి అప్పగిస్తారు. 2026లో అమెరికా G20 అధ్యక్ష పదవిని చేపట్టాల్సి ఉంది.