KTR : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,” […]
KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ […]
Pocharam Case : పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీం సహా మరో ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఈ ముగ్గురు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని రాచకొండ పోలీసులకు హ్యాండ్ఓవర్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ కాల్పుల కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను పోలీసులు నేడు మీడియా […]
హ్యాపీ బర్త్ డే.. ఎవర్ గ్రీన్ ‘డార్లింగ్’ ప్రభాస్! రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్లో యూఎస్, యూకే, జపాన్ వంటి […]
Wines Tender : తెలంగాణలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లేదా నిర్దేశిత కౌంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉంది. గత వారం బీసీ బంద్ , కొన్ని బ్యాంకుల మూసివేత కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామంటూ వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ, […]
నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో BRS నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న కేసీఆర్. తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల. రేపు మధ్యాహ్నం […]
ఆ ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎన్నిక తూతూ మంత్రమేనా? పైకి ఎన్నిక అని చెబుతున్నా… మంత్రులు మాత్రం ఎంపిక చేసేసి మమ అనిపించే ప్లాన్‌లో ఉన్నారా? పేరుకు అబ్జర్వర్స్ వచ్చినా… పెత్తనం మాత్రం మంత్రులదేనా? చెంబులో నీళ్ళు శంఖంలో పోస్తే తీర్ధం అయినట్టు తమ మనసులో ఉన్న పేర్లను పరిశీలన కమిటీతో చెప్పించబోతున్నారా? ఎక్కడ జరుగుతోందా తంతు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల […]
జూబ్లీహిల్స్ బైపోల్ కోసం కాషాయ దళం పక్కా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తోందా? అందుకే ఆ లీడర్స్‌ని స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో చేర్చిందా? కులాల వారీ కేలిక్యులేషన్స్‌తో వాళ్ళు ప్రచార బరిలో దిగబోతున్నారా? పైకి కనిపించకున్నా… అంతర్గతంగా కూటమి పార్టీలు ఇక్కడ కూడా కలిసే అడుగులేస్తున్నాయా? ఎవరా స్టార్ క్యాంపెయినర్స్? ఎలా ఉంది కమలం ప్లాన్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్, అధికారంలో ఉన్నాం […]