మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం
ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు షూట్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు ఈ మూవీ భారీ ముహూర్త పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక ప్రభాస్‌తో పాటు హీరోయిన్ త్రుప్తి దిమ్రి, నిర్మాతలు భూషణ్ కుమార్ , వంగా ప్రణయ్, శివ్ చానానా కూడా పాల్గొన్నారు. అలాగే ప్రాజెక్ట్‌లో ఉన్న ప్రముఖ నటులు వివేక్ ఒబెరాయ్ , ప్రకాశ్ రాజ్ పేర్లు కూడా ఈ సందర్భంగా అధికారికంగా రీ-కన్‌ఫర్మ్ అయ్యాయి.
ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న నిర్మాత.. కౌంటర్ ఇచ్చిన తండ్రి
ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న సినిమా నిర్మాత వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్మాతను కానీ అతని కొడుకును కానీ ఎన్‌కౌంటర్ చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నారు. ఐబొమ్మ రవి తండ్రి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా అబ్బాయి చేసింది తప్పే.. అందుకు ఎలాంటి శిక్ష విధించినా ఫేస్ చేస్తాం.. కానీ, ఎన్‌కౌంటర్ చేయమని చెప్పే హక్కు సినిమా వాళ్లకు ఎవరు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. అయితే, వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి జనాల మీద భారం మోపడం సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారా? అని ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు వ్యాఖ్యానించారు. ఇక, పోలీసుల విచారణలో ఉన్న ఇమ్మడి రవి ఇప్పటి వరకు రెండు సార్లు తనతో మాట్లాడాడని, లాయర్‌ను పెట్టేందుకు సిద్ధమని చెప్పిన మాటలను అంగీకరించలేదని అప్పారావు పేర్కొన్నారు. మరోవైపు, ఐబొమ్మ రవిని పోలీసులు నాలుగో రోజు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
మద్యం షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్.. మంత్రి కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జగన్ ప్రభుత్వంలో మైనింగ్ లో దోచుకున్నారు.. గత ప్రభుత్వంలో మైనింగ్ పై ఆధారపడిన వాళ్లకి ప్రతిరోజు దినదిన గండంగా గడిచింది.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా ముందుకు వెళ్తున్నాం.. వైసీపీ ప్రభుత్వంలో బలవంతంగా లాక్కున్న మైన్స్ ని తిరిగి ప్రారంభించాం.. ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాం.. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నాం.. విశాఖలో జరిగిన సమ్మిట్ లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి.. గత ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడిదారులను తరిమేశారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు తిరిగి నమ్మకం కలిగించారు.. ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..
జీ 20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శనివారం జీ 20 నాయకుల సమావేశం ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. ప్రపంచ అభివృద్ధి కొలమానాలను పునరాలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్య – ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఎదుర్కోవడానికి, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రతిస్పందన బృందాన్ని రూపొందించడానికి జీ20 చొరవను తీసుకోవాలని ఆయన ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోడీ తన X ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.. “జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో నాకు చాలా మంచి సమావేశం జరిగింది. భారతదేశం – దక్షిణాఫ్రికా భాగస్వామ్యం అన్ని అంశాలను, ముఖ్యంగా వాణిజ్యం, సంస్కృతి, పెట్టుబడి, సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధి, AI, కీలకమైన ఖనిజాలలో సహకారాన్ని విస్తరించడం గురించి మేము చర్చించాము” అని వెల్లడించారు. “అధ్యక్షుడు రామఫోసా విజయవంతమైన G20 అధ్యక్ష పదవికి అభినందనలు కూడా” అని ప్రధాని పోస్ట్ చేశారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం రెండవ సెషన్ విపత్తులు, వాతావరణ మార్పులు, న్యాయమైన ఇంధన పరివర్తన, బలమైన ఆహార వ్యవస్థ మధ్య సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించడంపై దృష్టి సారించిందని ప్రధానమంత్రి ఈ పోస్ట్‌లో రాశారు. మానవ కేంద్రీకృత, సమ్మిళిత భవిష్యత్తును నిర్ధారించడానికి భారతదేశం అన్ని రంగాలలో నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
WhatsApp గ్రూపులను టార్గెట్ చేస్తోన్న సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు తమ పన్నాగాలను కొత్త పంథాలో కొనసాగిస్తున్నారు. ఈసారి వారు నేరుగా WhatsApp గ్రూపులను లక్ష్యంగా చేసుకుని జాగ్రత్తలేని వినియోగదారులను తమ బారిన పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సైబర్ భద్రత అధికారులు చేసిన హెచ్చరికల ప్రకారం, SBI APK పేరుతో అనుమానాస్పద ఫైళ్లు, PDFలు, లింకులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫైళ్లను WhatsApp గ్రూపుల్లో ఉద్దేశపూర్వకంగా పంపిస్తూ, వాటిని ఓపెన్ చేస్తే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా వంటి సున్నితమైన వివరాలు పూర్తిగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. బ్యాంకులు, ముఖ్యంగా SBI పేరును దుర్వినియోగం చేస్తూ వినియోగదారుల నమ్మకాన్ని దోపిడీ చేయడమే ఈ మోసపు ఉద్దేశమని అధికారులు తెలిపారు.
పాకిస్థాన్‌కు నిద్ర దూరం చేసిన ‘రామ్ ప్రహార్’
పాకిస్థాన్ నుంచి ఏదైనా కొత్త దురాక్రమణ జరిగితే, ఆపరేషన్ సింధూర్ కంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని వెస్ట్రన్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ వెల్లడించారు. హరిద్వార్ మారుమూల ప్రాంతాలలో “రామ్ ప్రహార్” విన్యాసాల చివరి రోజున ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ నుంచి మరొక రెచ్చగొట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని, ఇది ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించాల్సిన అవసరానికి దారితీస్తుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలలో సరిహద్దు వెంబడి చీనాబ్, రావి, సట్లెజ్ వంటి నదులను దాటడం చాలా అవసరం కాబట్టి, సైన్యం ప్రత్యేకంగా నదులను దాటడం, శత్రు భూభాగంలోకి ప్రవేశించడం, సైనిక స్థానాలను స్వాధీనం చేసుకోవడం వంటి వాటిపై సాధన చేసిందని వెల్లడించారు.
స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన – సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది. స్మృతి – పలాష్ వివాహం నవంబర్ 23 (ఆదివారం) మహారాష్ట్రలోని సాంగ్లిలో జరగాల్సి ఉంది. అయితే వివాహం జరగకముందే విషాదకరమైన సంఘటన స్మృతి ఇంట్లో జరిగింది. ఈ స్టార్ క్రికెటర్ తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. పలు నివేదికల ప్రకారం.. ఆకస్మిక పెళ్లి ఇంటికి అంబులెన్స్ వచ్చింది. దాంట్లో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానను ఆసుపత్రికి తరలించారు. ఆమె తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, స్మృతి ప్రస్తుతానికి వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో ఉన్న స్మృతి మంధాన కొత్త ఇంట్లో గత కొన్ని రోజులుగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. నవంబర్ 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో వివాహం జరగాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా పెళ్లి కుమార్తె తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో ఆనందకరమైన వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనార్థం కరీంనగర్ నుంచి కాన్వాయ్‌తో బయలుదేరిన ఎమ్మెల్యే వాహనాలు పూడూరు మలుపు వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై వేగంగా సాగుతున్న కాన్వాయ్‌కు ఎదురుగా జగిత్యాల వైపు నుంచి హైదరాబాదుకు వెళ్తున్న మూడు ప్రైవేట్ కార్లు వరుసగా వచ్చాయి. ఈ క్రమంలో పూడూరు మలుపు వద్ద కాన్వాయ్‌లోని ఒక కారు అదుపు కోల్పోయి ముందున్న ప్రైవేట్ కారును ఢీకొట్టింది. ఢీకొట్టబడిన కారుతో పాటు దాని వెనుక వస్తున్న మరో రెండు కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొని తీవ్రంగా దెబ్బతిన్నాయి.
15 రోజులకో టూర్.. లగ్జరీ లైఫ్.. రవి లైఫ్ స్టైల్ ఇదే
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో నాలుగో రోజు కస్టడీ ముగిసింది. పోలీసులు కీలక విషయాలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయట పెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డ్బబులను ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టు తెలిపాడు. ప్రతీ 15-20 రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలకు టూర్లు వేశాడు.
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..
త్వరలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. ఈ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో జరగబోతున్నందున ఏ విషయంలోనూ రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నుంచి ప్రతినిధులు, పరిశ్రమల నేతలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాల అంబాసిడర్లు పాల్గొనే అవకాశం ఉండటంతో, అన్ని విభాగాలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. సమ్మిట్ జరుగనున్న ప్రాంగణంలో భద్రత అంశాన్ని సీఎం అత్యంత కీలకంగా పరిగణించారు. పాస్‌లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ ఇవ్వకూడదని, సమ్మిట్‌కు సంబంధం లేని వారందరినీ పూర్తిగా నిరోధించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖల వారీగా, అధికారులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేసి పకడ్బందీగా ప్రవేశాన్ని నియంత్రించాలి అని ఆయన సూచించారు.