ప్రభుత్వ ఉద్యోగికి మాయమాటలు చెప్పి బంగారు ఉంగరంతో దొంగ బాబాలు పరారైన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శంకర్ కుమార్, తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తక్కల్ల పల్లి, గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేంది మాధవరెడ్డి, నాగార్జున సాగర్ రోడ్డు తక్కల్లపల్లి గేటు వద్ద నుండి తమ గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ సమయంలోనే తెలుపు రంగు కారులో సాధువుల అవతారం ధరించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవార్నాథ్ మధారి, […]
ప్రభుత్వం ఉన్న చోటే పార్టీ బలంగా ఉండాలని హైకమాండ్ చెప్పిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం పై, పార్టీ ముఖ్యనేతలతో విస్తృత చర్చ జరగాలని, ఆచితూచి కమిటీ వెయ్యాల్సిన అవసరం ఉంది. సమర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తాం అని మహేష్ గౌడ్ అన్నారు.
తెలంగాణలో కమలం పార్టీ కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తోందా? ఈసారి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోందా? ఎన్నికలు జరగాల్సిన మూడు సీట్లలో ప్రాధాన్యాల మూడ్ మారిపోయిందా? బాగా డబ్బు సంచులున్న వారికోసం కాషాయ దళం వెదుకుతోందన్నది నిజమేనా? అసలేంటీ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం? ఆ విషయంలో అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే మార్చి 29తో ఖాళీ అవుతున్నాయి. ఇందులో రెండు టీచర్ సీట్లు కాగా… ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం. […]
ఆన్లైన్లో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల సేవలు నిలిపివేత భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్లో అనుమతులు జారీ చేసే పోర్టల్‌లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా పలు రోజుల పాటు ఆన్లైన్ అనుమతుల సేవలు నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రకటనలో తెలిపారు. సర్వర్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్‌లో భాగంగా వచ్చే నెల నాలుగో తేదీ వరకూ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. ప్రస్తుతం భవనాల నిర్మాణాలు, లేఅవుట్లకు […]
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నగరంలో చెరువులను, కాలువలను, ఫుట్‌పాత్‌లను, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వందరోజులు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు.
తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్ లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. శనివారం, సీఈ సుధాకర్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా, సుధాకర్ రెడ్డి తనిఖీలు లేకుండా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు కేటాయించినట్లు వివరించారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు చేసే సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు చెప్పారు. […]
కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమని ఆరోపించారు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్ లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని, రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరమన్నారు.
అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్.. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీ అమెరికా పర్యటనలో ఉన్నారు మంత్రి నారా లోకేష్‌కు.. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది.. ఇక, అక్కడ పారిశ్రామికవేత్తతో సమావేశం అయ్యారు లోకేష్.. వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందన్నారు నారా లోకేష్… శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో […]
Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా వెలుగులోకి వచ్చింది. 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ కొట్టేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గ్రీక్ బిల్డర్స్ తో కలిసి.. ప్రభుత్వ ఆస్తిని కాజేశాడు సదరు అధికారి.. ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి సబ్ రిజిస్ట్రార్ నకిలీ పత్రాలు సృష్టించారు. కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది గ్రీక్ బిల్డర్స్. రెవెన్యూ అధికారుల చొరవతో […]