Bandi Sanjay : ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పనితీరు భేష్….
- సీడీటీఐ శిక్షణా తీరును అభినందిచింన కేంద్ర మంత్రి బండి సంజయ్
- సీఎఫ్ఎస్ఎల్, ఎన్ఎఫ్సీఎల్, సీడీటీఐ సంస్థలను సందర్శించిన కేంద్ర మంత్రి
- ప్రతి విభాగాన్ని పరిశీలించిన బండి సంజయ్
- అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం అభినందనీయమన్న కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : భారతదేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) అని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతోపాటు నార్కొటిక్, సైబర్, మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడిన దోషులను పట్టుకునేందుకు దొహదపడేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎఫ్ఎస్ఎల్ సంస్థను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్), నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ లాబోరేటరీ(ఎన్సీఎఫ్ఎల్), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (సీడీటీఐ) సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు విచ్చేసిన బండి సంజయ్ దాదాపు రెండున్నర గంటలపాటు అక్కడే గడిపారు. ఆయా సంస్థల్లోని ప్రతి విభాగానికి వెళ్లి పరిశీలించారు. అధికారులతో సమావేశమై ఆయా విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. దక్షిణ భారత దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలు హైదరాబాద్ లో ఉండటం గర్వకారణమన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాది కేసుల పరిష్కారానికి ఈ సంస్థలను సంప్రదించడంతోపాటు నేర పరిశోధనకు అవసరమైన ప్రామాణిక పత్రాలను సీఎఫ్ఎల్ఎల్ అందజేస్తోందని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Also Read
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
తొలుత సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీని సందర్శించిన బండి సంజయ్ ను సంస్థ జాతీయ విభాగం డైరెక్టర్ ఎస్.కే.జైన్, హైదరాబాద్ ఇంఛార్జ్ రాజీవ్ గిరోటీ స్వాగతం పలికారు. ఈ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర మంత్రి సీఎఫ్ఎస్ఎల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ డివిజన్, ఆక్సిజన్ ఫోరెన్సిక్ డివిజన్, డీఎన్ఏ, బయాలజీ డివిజన్, నార్కోటిక్, కెమిస్ట్రీ డివిజన్, ఫిజిక్స్ డివిజన్, సైకాలజీ డివిజన్ తోపాటు డాక్యమెంటేషన్ డివిజన్లను సందర్శించారు. క్లిష్లమైన కేసుల పరిష్కారంలో అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అధికారులను అడిగి తెలుసుకోవడంతోపాటు కేంద్రం నుండి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తగిన ప్రతిపాదనలను కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేతులు మీదుగా సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం ఎన్సీఎఫ్ఎల్, సీడీటీఐ సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. అక్కడ సైతం ప్రతి విభాగాన్ని సందర్శించారు. అధికారులతో సమావేశమయ్యారు. ఆయా సంస్థల పనితీరుపై సంబంధిత శాఖ అధికారులు పవర్ పాయింట్ ఇచ్చారు. పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, న్యాయవాదులకు ఇప్పటి వరకు 39,167 మందికి సీటీడీఐ అధికారులు ప్రత్యేక శిక్షణనివ్వడంతోపాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్న విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
Tragedy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృ వియోగం
తాజావార్తలు
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?