ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్.. ఇజ్రాయిల్ శనివారం ఇరాన్‌పై విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. సరిహద్దులో ఇరాన్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత ఇజ్రాయిల్ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో తేలికపాటి వార్హెడ్లను ఉపయోగించాయని ఇరాన్ సైన్యం తెలిపింది. అయితే, ఈ దాడిపై అమెరికన్ నిపుణులు విశ్లేషించారు. ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్‌కి చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఫెసిలిటీలపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలోని […]
స్థానిక సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అప్పగించింది. రాష్ట్రంలో బీసీ సర్వే మూడు దశల్లో ఎనిమిది వారాల వ్యవధిలో జరగనుంది.
ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్ఘంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎక్కడ ఎదో జరిగితే అది KTR కి ఎం సంబంధమని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, రేవంత్ సోదరుల ఇళ్ళ పై పోలీసులకు ఇలాగే చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.
నిన్న రాజ్ పాకాల సొంత ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసిన సందర్భం అని, 2, 3 రోజుల్లో ఒక రోజు వెజ్, మరో రోజు నాన్ వెజ్ లతో వంటలతో ప్రోగ్రాంలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదని, అక్కడ పోలీసులు దాడులు చేశారన్నారు.
కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన అంశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అనేక ప్రగల్బాలు పలికి గద్దేనెక్కి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసారని, 10నెలల కాంగ్రెస్ 10ఏళ్ల బీఆరెస్ పాలన దొందు దొందే రెండు పార్టీల పాలన ఒక్కటే అని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలకు రెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు.
కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌పార్టీలా? రేవ్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పలు వ్యాఖ్యలు చేసాడు. ఇందులో భాగంగా బామ్మర్థి ఫాంహౌజ్ లోనే రేవ్ పార్టీలా..? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.. ‘‘సుద్దపూస‘‘ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నయని, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని కోరారు. సీసీపుటేజీ సహా […]
తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ పోలీసులు (ఏడీజీపీ) తమ సహోద్యోగులలో 39 మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ 12వ బెటాలియన్‌కు చెందిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు. సస్పెండ్ చేసిన తమ సహోద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 27 ఆదివారం నల్గొండ జిల్లాలో నిరసన కార్యక్రమం జరిగింది. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరించడం లేదని భావించిన పోలీసు యంత్రాంగంలో పెరుగుతున్న అసంతృప్తిని ఈ నిరసన హైలైట్ చేసింది. తమ […]
తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన, నిరంకుశ చర్యలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. తమ ఫిర్యాదులను శాంతియుతంగా లేవనెత్తినందుకు 39 మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం స్పష్టమైన అణచివేత చర్య , వారి గౌరవం , రాజ్యాంగ హక్కులపై దాడి అని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని, నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని నేను ఆనాడే చెప్పా అని, ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని.. ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు […]
సింహపురిలో ఫ్యాన్ రెక్కలు వేటికవే వంగిపోయి తిరుగుతున్నాయా? బెండ్ తీసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నా.. ససేమిరా అంటున్నాయా? ఫ్యాన్ రిపేరవక కేడర్ ఉక్కపోతగా ఫీలవుతోందా? ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్నప్పుడు అట్లున్న పార్టీ ఇప్పుడెట్లా అయిపోయింది? నేతల మనసులు కలవబోమంటున్నాయా? ఏపీలో ఒకప్పుడు వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు ఒకటి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర మంతటా టిడిపి గాలి వీచినా నెల్లూరులో మూడు సీట్లకే పరిమితం అయింది. ఇక 2019లో […]