ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకున్నా మూడో నెలలో పింఛన్ పంపిణీ చేసేలా.. మొదటి రెండునెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడు నెలలు తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్టు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్‌లైన్స్ అమలులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే దాన్ని మళ్లీ ఇచ్చే వారు కాదు. ఏ కారణం చేతనైనా పింఛనుదారుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే.. 2వ నెలలో బకాయితో పాటు పింఛన్ అందించనున్నారు.
అర్థాంగి అనే మాటకు అర్థం చెప్పిన మహిళ.. తన భర్త ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసి..!
భార్య జీవితానికి సహచరురాలే కాదు, గమ్యానికి ప్రేరణ కూడా. ఆమె ప్రేమ, అనురాగం, బంధం భర్త జీవితాన్ని మరింత విలువైనదిగా మారుస్తాయి. భార్య అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆమె భర్త ఆనందానికి మూలం, భర్త బాధలను తగ్గించే ఓదార్పు, ప్రతి విజయానికి వెనుక ఉన్న అండగా నిలిచే వ్యక్తి. ఆమె తోడు ఒక కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఒక సంతోషకరమైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది. భార్య తన చిన్న చిన్న చర్యలతో కూడా జీవితాన్ని సున్నితంగా, సుందరంగా తీర్చిదిద్దుతుంది. ఆమె ఒక స్నేహితురాలు, మార్గదర్శి, కష్టకాలంలో ధైర్యం ఇచ్చే తోడుగా ఉంటుంది. ఆమె చూపే ప్రేమ, చూపించే నమ్మకం, అందించే మద్దతు మన జీవితానికి నడిచే దారి చూపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, భార్య అంటే జీవితపు గుండె చప్పుడు, కుటుంబానికి ప్రాణమని చెప్పచ్చు.
దారుణం.. ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువును ఎత్తుకెళ్లిన కుక్క
మమతా బెనర్జీ ప్రభుత్వంలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ ప్రభుత్వాస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందును ఓ కుక్క నోటితో కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది. బంకురా జిల్లా బిష్ణుపిర్ సిబ్ డివిజన్‌లోని బంకురా సోనాముఖి రూరల్ ఆస్పత్రికి నవంబర్ 18న స్థానికంగా ఉండే గర్భిణీ వచ్చింది. రాత్రిపూట టాయిలెట్ కోసం బాత్రూమ్‌కి వెళ్లింది. అయితే ఉన్నట్టుండి ఆరు నెలలు నిండని శిశువు ఆస్పత్రి వాష్‌రూమ్‌లోనే ప్రసవం అయిపోయింది. అయితే ఆస్పత్రిలోనే తిరుగుతున్న ఓ కుక్క హఠాత్తుగా నోటితో కరుచుకుని వెళ్లిపోయింది. ఈ పరిణామంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అప్రమత్తమైన సిబ్బంది.. తదుపరి చికిత్స కోసం బిష్ణుపూర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. సాయం చేయమని బతిమాలినా.. ఆస్పత్రి సిబ్బంది ఎవరూ రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో విద్యుత్ అంతరాయం.. బీజేపీ కారణమని విమర్శలు..
అదానీ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో సహా అతడి మేనల్లుడు సాగర్ అదానీ మరికొందరు 2020-2024 మధ్యాలంలో రూ. 2,029 కోట్లు అంచాలు ఇచ్చారని అమెరికా న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. అయితే, దీనిపై కాంగ్రెస్, దాని అధినేత రాహుల్ గాంధీ అదానీపై మరోసారి ఆరోపణలు గుప్పించారు. మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి అదానీకి, పీఎం మోడీ రక్షిస్తున్నాడని అతను స్వేచ్ఛగా ఉన్నాడని ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే తప్పా ఎలాంటి విచారణ నమ్మదగినది కాదని చెప్పారు. అంతిమంగా బీజేపీ నిధులు నిర్మాణం మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నందున నరేంద్రమోడీ పేరు బయటకు వస్తుందని చెప్పారు.
గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. డిసెంబర్ 9 నుండి హాల్‌టికెట్స్
గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అప్టేడ్ ఇచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది టీజీపీఎస్సీ. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. కాగా, 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 నుండి 12. 30 వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఎగ్జామ్ కు అరగంట ముందే గేట్స్ క్లోజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. OMR విధానం లో పరీక్ష ఉండనుంది.
రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణతో 1800 కొత్త ఉద్యోగాలు
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్ లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు. రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని ఆయన తెలిపారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జిఇ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. 2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రసంసించారు.
ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పనితీరు భేష్….
భారతదేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) అని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతోపాటు నార్కొటిక్, సైబర్, మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడిన దోషులను పట్టుకునేందుకు దొహదపడేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎఫ్ఎస్ఎల్ సంస్థను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్), నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ లాబోరేటరీ(ఎన్సీఎఫ్ఎల్), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (సీడీటీఐ) సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు విచ్చేసిన బండి సంజయ్ దాదాపు రెండున్నర గంటలపాటు అక్కడే గడిపారు. ఆయా సంస్థల్లోని ప్రతి విభాగానికి వెళ్లి పరిశీలించారు. అధికారులతో సమావేశమై ఆయా విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. దక్షిణ భారత దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలు హైదరాబాద్ లో ఉండటం గర్వకారణమన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాది కేసుల పరిష్కారానికి ఈ సంస్థలను సంప్రదించడంతోపాటు నేర పరిశోధనకు అవసరమైన ప్రామాణిక పత్రాలను సీఎఫ్ఎల్ఎల్ అందజేస్తోందని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది: రాష్ట్రపతి
కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవం వేదికగా భక్తులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో అందరూ శివున్ని కొలుస్తారన్నారు. అసత్యంపై సత్యం గెలిచిన పండగ ఇది అని.. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం చేయడం ఎంతో ఆనందమని హర్షం వ్యక్తం చేశారు. అందరూ ఒక్కటై దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని కోటి దీపోత్సవం వేదికపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణం, పూరీ జగన్నాథుని పూజలో పాల్గొనడం నా అదృష్టమని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
మళ్ళీ హైకోర్టుకు వర్మ.. ఆ కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వండి!
ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి అనకాపల్లి, గుంటూరులో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఈ రెండు పిటిషన్లు మీద రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసులు నమోదు చేసిన కేసులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మొత్తం ఇప్పటి వరకు వర్మపై ఏపీలో 3 కేసులు నమోదు అయినట్టు అయింది.
రాజకీయాలకు పోసాని కృష్ణమురళి గుడ్ బై
సినీ రచయిత నటుడు పలు సినిమాల్లో హీరోగా కూడా నటించిన పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నన్ను ఎవరూ ఏమీ అనలేదని పేర్కొన్న ఆయన ఎవరి గురించి ఇక నుంచి మాట్లాడను అని పేర్కొనడం గమనార్హం. నిజానికి పోసాని కృష్ణ మురళి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీ తరఫున గుంటూరు జిల్లా నుంచి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.