Etela Rajender : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మత్స్యకారుల దశపై ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో గురువారం నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల, మత్స్యకారుల సమస్యలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మత్స్యకారులు భారీ జనాభా కలిగి ఉన్నప్పటికీ, వారికి తగిన రాజకీయ ప్రోత్సాహం లేకుండా పోయిందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వారిని ఉపయోగించుకుంటున్నారనే విమర్శను ఆయన వ్యక్తం చేశారు.
Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ
మత్స్యకారులలో చాలామంది స్వతంత్రంగా ఎదిగినవారేనని, కానీ వారిని రాజకీయంగా ఎవరూ గుర్తించలేదని ఈటల అభిప్రాయపడ్డారు. యాదవులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తమ వృత్తుల ఆధారంగా సభ్యత్వాలు పొందుతున్నప్పటికీ, మత్స్యకారులకు మాత్రం ఇది సాధ్యం కావడం లేదన్నారు. వృత్తి మీద ఆధారపడి బతికే వారికే సభ్యత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మత్స్యకారులు సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ సహకారాన్ని పొందాలని సూచించిన ఈటల, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాలను ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఎన్‌ఎఫ్‌డీసీ బోర్డుకు కొంతమందిని తీసుకెళ్లే హామీని ఈటల ఇచ్చారు.
ఎల్ఎండీ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటును ఆపడానికి ఎన్నో పోరాటాలు చేశామని ఈటల గుర్తుచేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం తాను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో సభ్యత్వాన్ని అడిగి తీసుకున్నానని, వారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారుల అభివృద్ధికి రాజకీయాలు, సహకార సంఘాలు కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈటల స్పష్టం చేశారు.
Adani: అదానీకి భారీ షాక్.. బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసిన కెన్యా..