తనిఖీలలో ఆరు క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు. రాఘవేంద్ర క్లినిక్, హనుమాన్ క్లినిక్, గ్లోబల్ క్లినిక్, గఫర్ క్లినిక్, పల్లవి క్లినిక్ ల సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యా అర్హత లేకుండా ఎంబిబిఎస్ ప్రాక్టీస్ చేస్తున్న ఆరుగురు డాక్టర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్.ఎం.ఎల్ యాక్ట్ 34, 54 కింద కేసు నమోదు చేసి సంవత్సరం ఇంప్రెయర్మెంట్, ఐదు లక్షల ఫైన్ విధించి FIR తయారు చేస్తామని ఆయన తెలిపారు.…
మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనలతో సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉందన్నారు భట్టి విక్రమార్క. మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్స్ నిర్మిస్తాం.. వారు సకల సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని, మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు 1000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం.. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధిని కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
స్పెషల్ పోలీసుల ఆందోళనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. పోలీస్ బెటాలియన్స్‌లో ఆందోళన చేసినవారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. మళ్లీ ఆందోళనలకు దిగడంపై పోలీస్‌శాఖ సీరియస్ అయ్యింది. పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించమని డీజీపీ తెలిపారు.
స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఘనంగా ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్‌పే ద్వారా స్పాన్సర్ చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌ను అక్టోబర్ 20, 2024న హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు , 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొన్నారు.
పార్టీ పవర్లో ఉన్నప్పుడు మస్త్ మస్త్ ఎంజాయ్ చేసిన ఆ లీడర్స్ ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నారు? చివరికి బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం ఎందుకు డుమ్మా కొడుతున్నారు? వాళ్ళను వెంటాడుతున్న భయం ఏంటి?ఇంకా మన టైం మొదలవలేదంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? లేక వేరే ఆలోచనలో ఉన్నారా? ఎవరా లీడర్స్? ఎక్కడ జరుగుతోందా తంతు?
CM Chandrababu : రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.50 కోట్లను విడుదల చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇంధన వాడాకాన్ని తగ్గించేందుకు నూరు శాతం ఎల్ఈడి దీపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో […]
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..కానీ ఆ నేతకు మాత్రం నోరే అతి పెద్ద సమస్య అట. తిరిగే కాలు, తిట్టే నోరు అన్నట్టుగా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని వెంటేసుకుని తేడా మాటలు మాట్లాడకుంటే ఆయనకు నిద్ర పట్టదట. కానీ... ఇప్పుడు తాను ప్రతిపక్షంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయి మాట్లాడటమే లేటెస్ట్ హాట్.
ఉదయం నుండి సాయంత్రం వరకు బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్ లతో కలిసి నీలోఫర్ కేఫ్ కు వచ్చారు.
జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులపై రాహుల్ గాంధీ స్పందన.. కేంద్రంపై ఫైర్ జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు . ఎక్స్‌లో కాంగ్రెస్ అధినేత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని ఆరోపించారు. నిరంతర ఉగ్రవాద కార్యకలాపాలు, సైనికులపై దాడులు, పౌరుల హత్యల కారణంగా ఈ రాష్ట్రం ప్రమాదపు నీడలో జీవిస్తోందని పేర్కొన్నారు. ముగిసిన రెండో రోజు […]
Duddilla Sridhar Babu : గత ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలివ్వలేదని విమర్శించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలుచ్చామని ఆయన తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు ముందు విద్యార్థులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయని, ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసారన్నారు. […]