పనుల్ని ఎండీ అశోక్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి కాండూట్ కు లీకేజీ సమస్య ఉందని, ప్రజలకు సరఫరాలో ఇబ్బంది వస్తుందని పనుల వాయిదా వేస్తు్న్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మక గండిపేట్ కాండూట్ ను పదేళ్లుగా వేధిస్తున్న లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు.
కేసీఆర్ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు.. ఏడు లక్షల కోట్లు అప్పుచేసి పోయిండని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇవాళ వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నెలకు రూ.7 వేల కోట్లు మిత్తి కడుతున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే అని ఆయన వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్న, డిమాండ్ చేస్తున్నాం పేదల ఇండ్లను కూల్చోద్దు అని ఆయన అన్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మూసీ సుందరీకరణ ను తెర మీదకు తెచ్చారని, సిగ్గులేకుండా ప్రభుత్వం పేద ప్రజల ఇండ్లను కూల్చుతోందన్నారు కిషన్ రెడ్డి.
రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా అని ఆయన బండి సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని, కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పు అని ఆయన అన్నారు.
కొమురం భీం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వచ్చిన ఏనుగు మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర నుండి ప్రాణహిత సరిహద్దు 30 కిలోమీటర్ల దూరంలో రెండు రోజుల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు.
ఇవాళ ఆయన ఎన్టీవీతో ముఖాముఖి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చామని, ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినమని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చిట్టినాయుడి అని, ఆ చిట్టినాయుడు ఏదో కేసు పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటే భయపడేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మీ హయాంలోనే ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చారు.. ఇప్పుడు ఎలా అక్రమమయ్యాయో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణను ఏటీఎం లాగా మార్చుకోవాలనుకుంటున్నారా అని ఆయన అన్నారు.
పార్టీలో లేరు…. పార్టీతో సంబంధం లేదు. కానీ… అధిష్టానం పిలుపునిచ్చిందంటూ…. సడన్‌గా ఓ గ్రూప్ గులాబీ కండువాలు మెడలో మెడలో వేసుకుని వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసింది. గులాబీ పార్టీకి జై కొట్టింది. అది చూసి… పార్టీ కేడరే నోరెళ్ళబెట్టాల్సి వచ్చిందట. ఇంతకీ ఎక్కడ జరిగిందా విచిత్ర ఘటన? ఎందుకలా కొత్త గ్రూప్ రోడ్డు మీదికి వచ్చి ఆందోళ చేసింది? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి […]
ఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్ ఆవరణలో MDOలతో జరిగిన వర్క్‌షాప్ లో పాల్గొని .MDOలకు స్టార్ రేటింగ్స్ అందజేశారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గారి ఆదేశాల ఆధారంగా మేం లక్ష్యాలు నిర్దేశిస్తామని, మీరు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తారన్నారు. ఇది మొదటి ప్రయత్నం.. రానున్న రోజుల్లో రెండ్రోజులపాటు ఇలాంటి సమన్వయ సమావేశాలు నిర్వహించుకుందామని, మీరు లేవనెత్తుతున్న సమస్యలు.. అందరు ఎదుర్కొంటున్న సమస్యలు.. రానున్న రోజుల్లో.. […]