Chicken chettinad: చికెన్ కర్రీ బోర్ కొడుతుందా, చెట్టినాడ్ స్టైల్‌లో చేయండి లొట్టలేసుకుంటూ తింటారు..
- రెగ్యులర్ చికెన్ కర్రీలు బోర్ కొడుతున్నాయా..
- చికెన్ చెట్టినాడ్ స్టైల్ కర్రీ చేసుకోండి..
- స్పైసీ, రుచి చెట్టినాడ్ చికెన్ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken chettinad: ఆదివారం వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో మసాలా ఘుమఘుమలాడుతుంది. చాలా మంది చికెన్, మటన్ కర్రీలు చేసుకుంటారు. అయితే, ప్రతీ సారి కూడా ఒకే విధంగా చేసిన చికెన్ కర్రీ తింటూ ఉంటే బోర్ కొడుతుంది. కొత్తగా మసాలా ఘాటుతో వేరే స్టైల్‌లో చికెన్ కర్రీ చేస్తే ఆ తృప్తి వేరుగా ఉంటుంది.
మసాలాలు ఎక్కువగా ఉండే ‘‘చికెన్ చెట్టినాడ్’’ వంటకాన్ని ఒకసారి ట్రై చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు. తమిళనాడు చెట్టినాడ్ ప్రాంతానికి చెందిన ఈ వంటకం చాలా స్పైసీగా, రుచిగా ఉంటుంది. ఈ వంటకం చేయడానికి కొద్దిగా ఓపిక అవసరం కానీ ఒక్కసారి కుదిరింది అంటే ఆ టేస్ట్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది.
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
కావాల్సిన పదార్థాలు:
చికెన్ -1 కేజీ, ఉల్లిపాయలు- 4 సన్నగా తరిగినవి, టొమాటోలు- 4 ముక్కలుగా చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు- 2 రెబ్బలు, నూనె 6-7 టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత.
చెట్టినాడ్ మసాలా కోసం:
ఎండుమిర్చి 5-6, ధనియాలు -4 టేబుల్ స్పూన్లు, మిరియాలు -2 టీ స్పూన్, జీలకర్ర-2 టీ స్పూన్, సోంపు-2 టీ స్పూన్, లవంగాలు -6 నుంచి 8, యాలకులు-4, దాల్చిన చెక్క- చిన్నముక్క, ఎండుకొబ్బరి తురుము- 3 టేబుల్ స్పూన్లు.
మసాలా తయారీ:
మసాలా దినుసుల్ని తక్కువ మంటపై డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారాక మిక్సీలో పట్టి మెత్తని పొడిగా చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవచ్చు.
తయారీ ప్రక్రియ:
ముందుగా స్టవ్‌పై కడాయి పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకుల, కొంచెం సోంపు, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి, కొంచె ఉప్పు వేసి, టొమాటో మగ్గేవరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు చికెన్ ముక్కలు, పసుపు వేసి బాగా కలపాలి. చికెన్‌లో నీరంతా బయటకు వచ్చి ముక్కలు కొంచెం గట్టిపడే వరకు 5 నిమిషాలు వేయించాలి. దీని తర్వాత మనం ముందే సిద్ధం చేసుకున్న చెట్టినాడ్ మసాలా పొడిని కర్రీలో వేసి బాగా కలపాలి. మసాలా ముక్కలకు పట్టే విధంగా 2-3 నిమిషాలు వేయించుకోవాలి. దీని తర్వాత ఒక కప్పు నీరు పోసి మూత పెట్టాలి. చికెన్ పూర్తిగా కుక్ అయిన తర్వాత, గ్రేవీ చిక్కబడిన తర్వాత నూనె పైకి తేలుతుంది. సన్నగా తరిగిన కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. కర్రికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపాలి. నోరూరించే చికెన్ చెట్టినాడ్ కర్రీ తయారైంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?