CM Revanth Reddy: కాంగ్రెస్ అధ్యక్ష పదవి విలువైంది.. జాగ్రత్త.. క్యాడర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా విలువైంది.. దాన్ని ప్రజల కోసం వాడుకోవాలని.. లేదంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాజాగా పార్టీ క్యాడర్‌తో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. అందరం కలిసి పని చేస్తే.. సరిగ్గా రెండున్నర ఏళ్లలో అధికారంలోకి వచ్చాం.. వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్.. తరవాత సీపీఐ ఉందని చెప్పారు. మిగిలిన పార్టీలు తాము తెచ్చిన స్వాతంత్య్రం తర్వాత ఏర్పడ్డాయన్నారు. అవే ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నాయని.. పార్టీ విధానమే కాదు.. ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవాలని క్యాడర్‌కు సూచించారు. రాజ్యాంగం మార్చాలని ఒక పక్క.. రిజర్వేషన్లు రద్దు చేయాలని మరో పక్క కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పది రోజులు ఇక్కడ ఉండటం శిక్ష అనుకుంటే ప్రయోజనం ఉండదని.. శిక్షణ అనుకుంటే పార్టీలో మీ అవకాశాలు మెరుగు పడుతుందని చెప్పారు. ఎవరికి వారసత్వంగా హోదా రాలేదు.. షర్మిలకు అవకాశం ఉన్నా… ఆమె తీసుకోలేదన్నారు. బ్రిటీష్ వాళ్ళు.. గాంధీ మీదకు లాఠీ ఎత్తడానికి కూడా భయపడ్డారని చెప్పారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వతా… బీజేపీ వారసత్వం ఉన్న వాళ్ళు బుల్లెట్‌ల వర్షం కురిపించారని విమర్శించారు.
READ MORE: Chicken chettinad: చికెన్ కర్రీ బోర్ కొడుతుందా, చెట్టినాడ్ స్టైల్‌లో చేయండి లొట్టలేసుకుంటూ తింటారు..
Also Read
రాహుల్ గాంధీ 150 రోజులు పాదయాత్ర చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. “వైఎస్ గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి ప్రణాళిక గొప్ప ప్రణాళిక. షర్మిల వైఎస్ పేరు చెప్పుకుని ఏ హోదాకు అయినా వెళ్ళొచ్చు. కానీ అవకాశం కోసం కాంగ్రెస్ కోసం కష్టపడుతున్నారు. అదే మమల్ని పార్టీ జిల్లా అధ్యక్షుల్ని చేసింది. ఈ సామ్రాజ్యం మాదే అని అనుకుంటే అక్కడే మొదలవుతుంది మీ ఫెయిల్యూర్. పార్టీలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. గాంధీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనవాయితీ ఉంది. దాన్ని ప్రజా స్వామ్య స్ఫూర్తితో ఆలోచనా చేయాలి. కానీ వ్యతిరేకులను బయటకు పంపాలి అనుకోవద్దు. నేను పీసీసీ అయినప్పుడు ఏం జరిగిందో చూశారు. ప్రతీ నాయకుడి ఇంటికి వెళ్ళిన. నచ్చచెప్పిన. ఆ తరవాత నాయకుల ఆలోచనలో మార్పు వచ్చింది. అందరం కలిసి పని చేస్తే సరిగ్గా రెండున్నర ఏళ్లలో అధికారంలోకి వచ్చాం. డిజిటల్ మెంబర్ షిప్ చేయండి. అత్యధికంగా చేసిన వాళ్లకు రాహుల్ గాంధీతో ఫొటో తీయించాం. మేం అధ్యక్షులం అయ్యాం అని పని వదులుకోవద్దు. డీసీసీ అధ్యక్షులుగా పని చేసిన వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. అక్కడ మిస్ అయిన వాళ్లకు ఛైర్మన్ పదవులు ఇచ్చాం. అనుబంధ సంఘాల బాధ్యతలు తీసుకోండి అని చెప్పిన. కానీ చాలా మంది తిట్టుకున్నారు. నీ టైమ్ బాగుంది. పీసీసీ అయ్యావు అని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక అనుబంధ సంఘాల అధ్యక్షులకు పదవులు ఇచ్చాం. 37 మంది కార్పొరేషన్ ఛైర్మన్లు అయ్యారు. మీ ప్రతి చర్య మేం గణిస్తున్నాం. ప్రతీ రోజు పరీక్ష పెట్టం. ఏ కోటా లేదు. కాంగ్రెస్‌లో మెరిట్ కోటాలో పాస్ ఐతేనే పదవులు. ఒక కోటాలో డీసీసీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు ఐతే జాతీయ అధ్యక్షుడితో కలిసి అవకాశం వస్తుంది. ఎడమ బొజ్జు సాధారణ కార్యకర్త. ఆయన్ని పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. గెలిచి వచ్చాడు. ఇందిరమ్మ ఇంట్లో ఉండే వాళ్ళు అతను. కాంగ్రెస్ అధ్యక్ష పదవి విలువైంది. దాన్ని ప్రజల కోసం వాడుకోండి. లేదంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. పార్టీ పెట్టుకున్న విశ్వాసం వదులుకోవద్దు. మీరంటే నచ్చని వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా పక్కన పెట్టుకోండి.” అని సీఎం వెల్లడించారు.
READ MORE: Prabhas: “ప్రేమలో పడాలని ఉంది”.. మనసులో మాట బయటపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?