Minister Seethakka : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ… నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ అభివృద్ధికి కొత్త మలుపు అవుతుందని సీతక్క అన్నారు. మూడు పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఇప్పటికీ ప్రజలు నీటి సమస్యలు, డ్రైనేజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. “ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను స్వయంగా చూస్తున్నారు. కాబట్టి […]
Kurnool Bus Fire : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూల్ ఘటనలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందజేయనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. Ananya […]
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. అనంతరం జరిగిన స్క్రూటినీ ప్రక్రియలో 186 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లని వాటిగా తేలాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే, శుక్రవారం 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి […]
ఏపీలో పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం సాగుతోంది. వీరికి పోలీసుల మద్దతు తోడవుతోంది. ఇంకేముంది.. మూడు ముక్కలు.. ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతోంది యవ్వారం. ఓవైపు తెలంగాణలో పేకాట క్లబ్బుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తే.. ఏపీలో మాత్రం పేకాటను పెంచి పోషించి.. త్వరలో రిక్రియేషన్ క్లబ్బుల స్థాయికి తీసుకెళ్లే యజ్ఞం శ్రద్ధగా సాగుతోంది. పైగా కొందరు నేతలు మా ప్రాంతంలో పేకాట కామన్ అంటూ కామెంట్లు చేయడం.. చతుర్ముఖ పారాయణానికి మరింత కిక్ ఇస్తోంది. ఏపీలో […]
Viral : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో మొత్తం 36 మంది విద్యార్థులు ఉండగా, వారిని బోధించేందుకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే వారిలో ఒకరు డిప్యూటేషన్ పై మరో పాఠశాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగుతోంది. The Raja Saab: బర్త్ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ […]
Kalvakuntla Kavitha : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ.. “సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ, రాజకీయాల గురించి తప్పకుండా మాట్లాడుతాను. ప్రజలకు మేలు జరగాలంటే పార్టీలు అవసరం అనేది తప్పనిసరి కాదు. ప్రజలు కోరుకుంటే, సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుంది” అని అన్నారు. జాగృతి […]
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు..! తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. తుని కొండ వారి పేటకు చెందిన నారాయణరావు ఇంటి ముందు మైనర్ బాలిక ఇల్లు ఉంది. మైనర్ బాలికకు తండ్రి లేడు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గతంలో సైతం మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకుని వెళ్లాడు. పాపకు బ్లెడ్ ఇన్ఫెక్షన్ […]
Jubilee HIlls Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థుల కోసం 321 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో 135 సెట్ల నామినేషన్లు (81 మంది అభ్యర్థులవి) అధికారులు ఆమోదించారు. మిగిలిన 186 సెట్ల నామినేషన్లు (130 మంది అభ్యర్థులవి) వివిధ లోపాల కారణంగా తిరస్కరించబడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన అఫిడవిట్లో కొన్ని అవసరమైన వివరాలను పేర్కొనలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, రిటర్నింగ్ అధికారి ఆమెను డిక్లరేషన్ సమర్పించాలని […]
KTR : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,” […]
KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ […]