మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది.
ఆ ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు.. కిషన్ రెడ్డి ఫైర్.. సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 35 లక్షల సభ్యత్వం తెలంగాణలో పూర్తి అయిందన్నారు. ఈ నెల చివరి వరకు పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి […]
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు. సీఎం రేవంత్‌ని వ్యతిరేకించిన అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు... ఆ విషయం తెలుసు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ నెల 20 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేములవాడ పట్టణాభివృద్ధికి వరాల జల్లు కురిపించనున్నారు. అదే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్‌కి చెందిన ఐశ్వర్య (17) అదృశ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదో తారీకు తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఉప్పుగూడ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉందని విచారణలో తేలింది.
చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆనంద్ మల్లిగవాడ్ వివరించారు.
Koti Deepotsavam 2024 Day 8 : భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. కార్తిక మాసం శుభవేళ కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను సాదరంగా […]
Kishan Reddy : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులయ్యే నిర్వాసితులకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ మూసీ నిద్రలో భాగంగా కిషన్ రెడ్డి అంబర్‌పేట గోల్నాకలోని తులసీరామ్ నగర్‌కు చేరుకొని బస్తీవాసులు, బాధితులను కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బుల్డోజర్లకి భయపడే వారు ఎవరు లేరని, పేద ప్రజల జోలికి […]
తెలుగు భాషను కాపాడుకుందాం.. మన సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతాం 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల తరపున మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక ఖతార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సుపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను కాపాడుకుంటాం.. తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడుతాం అంటూ సదస్సులో […]
TG TET 2024: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్ లోని తప్పులను సవరిస్తేను అవకాశం కల్పించింది. టెట్ నోటిఫికేషన్ గతంలో విడుదల చేయగా, దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అభ్యర్థులు తమ అప్లికేషన్లలో జరిగే తప్పులను సరిదిద్దుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొత్త అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 16 నుంచి 22వ తేదీ […]