Damodara Raja Narasimha : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని దామోదర రాజనర్సింహ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నామని, మహిళా సాధికారత అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా భుజస్కందాలపై వేసుకుందన్నారు మంత్రి దామోదర. ఇందిరా గాంధీ హయం లో పేదలకు భూములు పంచిన గంత కాంగ్రెస్ ది అని, గత 10సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక గుంట భూమి,ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. సింగరేణి కార్మికులకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పై వుందని, గురుకుల విద్యార్థులకు 40%డైట్ చార్జీలు,100%కాస్మొటిక్ చార్జీలు పెంచామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. 10సంవత్సరాల నియంత,నిరంకుశ పాలన చూశామని, ప్రజల యొక్క ప్రతి ఆకాంక్షను నెరవేరుస్తామన్నారు.
Haryana: మరోసారి వార్తల్లోకెక్కిన నూహ్.. రెండు పార్టీల మధ్య రాళ్ల దాడి, యువతి మృతి
అనంతరం మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. జిల్లాలో ఓవైపు సింగరేణి,జెన్కో ఉద్యోగులు,మరోవైపు రైతుల కలయికతో వుంది. గత ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీసింది. రూ 200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పన కు పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు బైపాస్ రోడ్ ఏర్పాటు. డిబిఎం 38 ద్వారా సాగు నీరు త్వరలో అందించడానికి రూప కల్పన చేస్తున్నాం. జిల్లాలో 3బ్యారేజి లు కట్టి ఒక ఎకరానికి కూడా చుక్క సాగు నిరు అందించకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం కల్పించాం,200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు ఇస్తున్నాం. 500ల గ్యాస్ సబ్సిడీ అందజేస్తున్నం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం. మహిళల కోసం మిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. బడుగు బలహీనర్గాలకు అభివృద్ధి కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Pushpa 2 : బన్నీ అరెస్టు రోజు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటే?