Koti Deepotsavam Day-7: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆరంభమైన కోటిదీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.. ఇల కైలాసంలో జరిగే కోటి దీపాల పండుగను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు.. ఇక, ఆరో రోజు కోటిదీపోత్సవం కన్నుల పండుగా సాగింది.. కాగా.. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున […]
భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. నేడు ఏడో రోజు వైభవోపేతంగా జరగుతున్న కోటి దీపోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది. […]
మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారుల సాహస దృశ్యాలు వైరల్ మహారాష్ట్రలోని పూణె నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హదప్సర్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ మధ్య ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతుండగా పక్క ఫోర్సన్‌లో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయారు. నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఏ మాత్రం కంట్రోల్ కాలేదు. క్రమక్రమంగా మంటలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఓ చిన్నారి దిగే ప్రయత్నం చేసినా […]
IIT Madras : సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించింది. ఐఐటిఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం, పరిశోధన, శిక్షణ, సాంకేతికతలో రాష్ట్రం ముందుకు పోవడానికి దోహదం చేస్తాయి. 1. […]
APSRTC : ఆర్టీసీ బస్సుల్లో వృద్దుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీ కి పాటించాల్సిన నియమాలతో సిబ్బందికి మరోసారి APSRTC మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పల రాజు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్దులకు బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో 25 శాతం రాయితీ టికెట్లను ఎప్పట్నుంచో ఆర్టీసీ జారీ చేస్తోంది. టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్దారణ కోసం గుర్తింపు కార్డులు […]
ప్రభుత్వం 'సూపర్ సిక్స్ హామీలు' కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో గిరిజనుల గొప్ప సహకారం ఉంది : ప్రధాని మోడీ ధర్తీ అబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా బీహార్‌లోని జాముయ్‌లో ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించి, ఆయన పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 6000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను కూడా బహుమతిగా ఇచ్చారు. దీనితో పాటు గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేయడానికి గత ప్రభుత్వాలే కారణమని ప్రధాని మోడీ అన్నారు. గత ప్రభుత్వాల వల్ల గిరిజన సమాజం […]
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. ఏడాది మా పాలనపై చర్చకు మేం సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామని ఆయన తెలిపారు.
సంగారెడ్డి సెంట్రల్ జైలులో కేటీఆర్ ములాఖత్ ముగిసింది. సుమారు 40 నిమిషాలు 16 మందితో ములాఖత్ సాగింది. ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల, హాకింపేట రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారని, రాబందుల్లా రేవంత్ రెడ్డి పేదల భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.