SI Suicide : ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య కేసులో మహిళను అరెస్టు చేశారు పోలీసులు. వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ తన సర్వీస్ పిఠాలతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతని మరణానికి కారణమైన మహిళ బానోతు అనసూర్య అలియా అనూష అరెస్టు చేసినట్టు తెలిపారు పోలీసులు. రాంగ్ నెంబర్ ద్వారా హరీష్ పరిచయం చేసుకొని అతడిని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుంటుందని భావించి తరచూ ఫోన్ చేస్తూ అతనితో సన్నిహితం పెంచుకోవడం జరిగిందని తెలిపారు. ఎస్సైను ఎలాగైనా ఒప్పించి తనను పెళ్లి చేసుకుంటే న జీవితం బాగుంటుందని ప్రణాళికతో ఎస్సై హరీష్ ను బెదిరించ సాగింది అనూష. పెళ్లి చేసుకో పోతే మీడియా వారికి , అతని పై అధికారులకు నన్ను శారీరకంగా వాడుకున్నాడని చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఒత్తిడి తేవడంతో ఆమె వల్ల తీవ్రమైన మనోవేదనకు లోనయ్యాడు ఎస్సై హరీష్.
PV Sindhu: కాబోయే భర్తతో పీవీ సింధు ఎంగేజ్‌మెంట్ ఫోటోస్.. వైరల్
మండపాక శివారులో ఉన్న ఫీరియాడొ రిసార్ట్ లో ఆమె మాటల ద్వారా ఒత్తిడికి లోనై ఆత్మహత్య ప్రేరేపించబడి తన సర్వీస్ పిస్టల్ తో గద్దవ కింద కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పిన కథనం ప్రకారం మహిళకు ఎస్సై హరీష్ కు కు జరిగిన సంభాషలో ఎస్ఐ హరీష్ ను మహిళా పెళ్లి చేసుకో లేదా చచ్చిపోమని ఆత్మహత్యకు ప్రేరేపించగా తాను ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. నిందితురాలు బానోతు అనసూర్య అలియాస్ అనూషపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచినట్లుగా తెలిపారు పోలీసులు.
Minister Kondapalli Srinivas: పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు