హనుమకొండలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరంగల్ ఒక్క పట్టణానికి 6 వేల కోట్ల పనులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇది అని, వరంగల్ పట్టణాన్ని మహా నగరాన్ని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నామన్నారు.
ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 24న ఆల్ పార్టీ మీటింగ్ ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. నవంబర్ 24న ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈరోజు (మంగళవారం) […]
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ స్థాపనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఇతర రెవెన్యూ అధికారులపై స్థానికుల దాడి జరిగింది. ఈ దాడిలో అధికారులు ప్రయాణిస్తున్న వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు.
వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేడు పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఆయన కాళోజి కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా.. కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను కొట్టివేసింది. ఈ జీవో ద్వారా దాదాపు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
Ponguleti Srinivas Reddy : సమగ్ర కుటుంబ సర్వే శాస్త్రీయంగా జరుగుతుందని, హడావుడి లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుందన్నారు. కోటి 16 లక్షల 14 వేల 349 కుటుంబాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నట్లు, 9వ తేదీ నుంచి సర్వే జరిగుతోందని, ఇప్పటివరకు 58.3% అంటే 67 లక్షల 76 వేల 203 కుటుంబాల సర్వే జరిగిందన్నారు మంత్రి పొంగులేటి. ఏ కుటుంబానికి […]
ఇప్పటి వరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం ఖరీదు 3,045.76 కోట్లు అని, సన్నాలకు 9.21 కోట్ల బోనస్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్.. 50మంది ఆస్పత్రి పాలు.. అమ్మకాలు నిలిపివేత ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇప్పటికే గ్రిమ్‌వే ఫార్మ్స్ విక్రయించిన బ్యాగ్డ్ ఆర్గానిక్ బేబీ మరియు మొత్తం క్యారెటలను […]
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సమీక్షిస్తున్నారు.
వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు NOC సాధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిందని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామన్నారు.