CP CV Anand : మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించిన సీపీ సీవీ ఆనంద్
- గురుకులాలు పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించిన సీపీ ఆనంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP CV Anand : తెలంగాణ ప్రభుత్వము గురుకులాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, పొలిటికల్ లీడర్లు వసతి గృహాలను సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించారు హైదరాబాద్ CP CV ఆనంద్. ఈ సందర్భంగా విద్యార్థులతో వారి సమస్యలు, వారికి ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ విషయమై ప్రిన్సిపల్ తో చర్చించారు సీపీ సీవీ ఆనంద్. పిల్లలకు ఏ విధమైన డైట్ ఇస్తున్నారని స్టూడెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. వాణిశ్రీ ప్రిన్సిపాల్ , డాక్టర్ కె. చల్లా దేవి , డిప్యూటి డైరెక్టర్ శోషల్ వేల్ ఫేర్ శాఖ గారు పాఠశాలల్లోని కిచెన్, వాష్ రూమ్, సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ,రోబోటిక్ ల్యాబ్, స్పోర్ట్స్ రూమ్, డార్మిటరీలలను పని తీరు ను పోలీస్ కమిషనర్ కుతెలిపారు. ప్రత్యక్షంగా పోలీస్ కమిషనర్ ఆ విద్యార్థులకు బోధిస్తున్న విధానము గురించి అడిగి తెలుసుకున్నారు , గురుకుల పాఠశాలలో ఉన్న అన్ని అంతస్తులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని తీసుకోవాలని , క్రీడలు కార్యకలాపాలలో పాల్గొనాలని విద్యార్థులను ప్రోత్సహించారు, ఇది ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుందన్నారు సీపీ ఆనంద్. జీవితంలో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడంలో , విభిన్న వ్యక్తుల ఆలోచనలతో వ్యవహరించడంలో సహాయపడుతుందన్నారు. సంస్థలోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు విద్య, ఆహారం, క్రీడలు, మౌలిక సదుపాయాలు మెచ్చుకో తగ్గవిగా ఉన్నవన్నారు. అన్ని సాంఘిక , మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు , పాఠశాలల్లో మరింత మంచి పోషకమై నదిగా చేయడానికి , 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సౌందర్య సాధనాలను అందించడానికి ఏర్పాట్లు చేసినారని తెలిపారు, మీలో కొందరు NEET వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులను అభినందించారు . విద్యాసంస్థ ఉపాధ్యాయుల కృషి వల్లనే విద్యార్థులు ఇంతటి గొప్ప విజయాలు సాధించారు అని తెలిపారు . ఈ సంస్థల విద్యార్థులు కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ప్రయత్నించాలి. ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి, కష్టపడి చదువుకోండని సూచించారు సీవీ ఆనంద్.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!