Ponguleti Srinivas Reddy : ప్రజలకు మరింత మెరుగైన సేవల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునఃవ్యవస్థీకరణ చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు, మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. అవసరమైన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొదటి దశలో సంగారెడ్డి, పటాన్ చెరువు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ లో నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
AP: బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటైన సిట్‌లో మార్పులు.. అభ్యంతరాలు రావడంతో..!
అంతేకాకుండా.. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీలో, గండిపేట, శేరిలింగంపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం, మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మిస్తున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, గోల్కొండ మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను షేక్ పేట్ ప్రాంతంలో ఒకేచోట నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో నిర్మించే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీసం మూడు ఎకరాల్లో ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Delhi: పబ్లిక్ ప్లేస్‌లో మందు తాగొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్ హత్య..