Uttam Kumar Reddy : నల్గొండ లోకసభ స్థానం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 2024 లో అందరికీ మంచి చేశాము.. 2025లో కూడా అలానే చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, స్వతంత్ర భారతదేశంలో కులగనన చేయడం మొదటి సారి అని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖలో పూర్తి పారదర్శకత విధానాలను అమలు చేస్తున్నామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Pinarayi Vijayan: ‘‘కేరళ మినీ పాకిస్తాన్’’.. స్పందించిన పినరయి విజయన్..
కొత్త రేషన్ కార్డులు, రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వడం అందరికీ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. 2025 ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ లో మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు వచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డులు అందించే విధంగా ముందుకు వెళ్తామని, రికార్డు స్థాయిలో ధాన్యం పండటం జరిగింది అంతే స్థాయిలో కొనుగోలు చేశామని ఆయన వెల్లడించారు. ఎంఎస్‌పీ రేట్ కొనుగోలు చేసి సన్నలకు 500 బోనస్ కూడా ఇచ్చామన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!