KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏసీబీ తరుఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ పైన నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు లాయర్ సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన డబ్బు FEO కు చేరింది.. 55 కోట్ల బదిలీ లో ఎక్కడా అవినీతి జరగలేదని, ఎలక్షన్ కోడ్ కు ముందే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అగ్రిమెంట్ జరిగిందని.. దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించవు
కేటీఆర్ తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. పాలసీ నిర్ణయాలకు మాత్రమే ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని కోర్టుకు తెలిపారు లాయర్. ఈ కేసులో కేటీఆర్ A1 గా చేర్చినప్పుడు FEO ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సిద్ధార్థ్ దవే ప్రశ్నించారు.
Komatireddy Venkat Reddy : నల్గొండ ప్రజల దశాబ్దాల కల SLBC
ఇదిలా ఉంటే.. FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు .. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని AG సుదర్శన్ రెడ్డి వాదించారు. మూడు దఫాలుగా నగదు బదిలీ చేశారని, 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందని, ఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది హైకోర్టు.
ఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని న్యాయస్థానం ప్రశ్నించడంతో.. కేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయని ప్రభుత్వ తరుపు న్యాయ వాది తెలిపారు. నిబంధనలు ఎలా ఉల్లంఘించారు అది చెప్పండని, ఈ ఫార్ములా కేసులో ఎలాంటి విధివిధానాలు ఫాలో కాలేదో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించడంతో.. ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతులు పొందలేదని, HMDAగా పార్టీ కానప్పుడు FEO కు డబ్బులు ఎలా చెల్లిస్తుందని, అనుమతులు లేకుండానే FEO సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని, ఇలా నగదు బదిలీ చేయడం వల్ల 8 కోట్లు హెచ్ఎండిఏకు అదనపు భారం పడిందని, మునిసిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందన్నారు ప్రభుత్వం తరుపు లాయర్. అయితే.. వాదనలు ముగిసిన అనంతరం.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అంతేకాకుండా.. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది.
BJP: ‘‘కేజ్రీవాల్ ఎన్నికల హిందువు’’.. బీజేపీ ప్రచారం..