మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల పై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో ఏంజెపి గురుకుల సెక్రటరీ సైదులు , ఆర్సీవో లు, డిసిఓలు , ప్రిన్సిపల్లు పాల్గొన్నారు.
KCR : అధికారం లోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకాని తనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, తెలంగాణను తెచ్చి పదేండ్లు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను నిలదీయాలని, అందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు […]
TG Assembly Sessions : రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాల నేపధ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో ఈరోజు శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ […]
IAF Air Show : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఆకాశంలో వైమానిక ప్రదర్శన కనువిందు చేసింది. ఆదివారం నాడు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఉత్కంఠభరితమైన విన్యాసాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దేవాదాయ శాఖ […]
అమానుషం.. మామ మొఖంపై చెప్పుతో కొట్టిన కోడలు.. మానవత్వం మంటగలుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వృద్ధులపై విచక్షణారహితంగా కొందరు దాడులు చేస్తున్నారు. ఆస్తుల కోసం కొందరు, భారమై మరికొందరు వృద్ధులపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ కోడలు తన మామను వృద్ధుడని కూడా చూడకుండా చెప్పుతో దాడి చేసింది. వీల్ చైర్ లో కూర్చున్న మామ వద్దకు పరుగున వచ్చిన కోడలు చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం […]
Maoists :తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా పామిడి ఏరియాలో ఉన్న బేస్ క్యాంపు లపై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. గత నాలుగు రోజులు వ్యవధిలో మూడుసార్లు జీడిపల్లి బేస్ క్యాంపై మావోయిస్టులు దాడి చేశారు. గత రాత్రి బేస్ క్యాంప్ పై దాడి చేశారు. మళ్లీ ఆయుధాలను సమకూర్చుకొని ఈ తెల్లవారుజామున కూడా దాడి చేశారు .దీంతో తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సరిహద్దులు […]
BRSLP : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ఎర్రవెల్లి వద్ద ఉన్న కేసీఆర్ నివాసంలో జరుగుతున్నది, ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యానించిన ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వమెలో ఏడాదిగా తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలు, వర్గా ల ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికపై ప్రశ్నించేందుకు కావలసిన వ్యూహాలను ఆయన […]
Ponguleti Srinivas Reddy : పదేళ్ల పాలనకు.. ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉందని, మా ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్ ను NIC కి అప్పగించామని, 2024 […]
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని, కాంగ్రెస్ మాత్రం సామాజిక తెలంగాణ దృక్పథంతో ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో […]
KTR : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ఈ ఫిల్మ్‌ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖ బీఆర్ఎస్ నేతలు హాజరై ఫిల్మ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గాంధీభవన్ వెలవెలబోతుండగా, తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషమని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌తో బీఆర్ఎస్ […]