Harish Rao : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచినట్లు గుర్తు చేస్తూ, ఉద్యమకాలపు జ్ఞాపకాలు తాజా డైరీలో ఉంటాయన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యం నేటి డైరీ ఆవిష్కరణ బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి ఉపయోగపడాలని హరీష్ రావు ఆకాంక్షించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ కోతలు పెడుతోందని విమర్శిస్తూ, దీనిపై ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి తనపై కేసులు పెట్టారని తెలిపారు. కేటీఆర్‌పై కూడా కేసులు పెట్టి కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ లోగో వంటి అంశాలను కూడా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుకుంటోందని ధ్వజమెత్తారు.
Post Office Scheme: అద్దిరిపోయే పోస్ట్ ఆఫీస్ పథకం.. సింగిల్ ఇన్వెస్ట్ మెంట్‌తో.. మీ డబ్బు డబుల్!
రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు రేవంత్ రెడ్డి రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టారని, పెళ్లికి ఇచ్చే కల్యాణ లక్ష్మీ పథకాన్ని పిల్లలు పుట్టాక ఇస్తామనే విధంగా మార్చారని ఎద్దేవా చేశారు. రేవంత్ సీఎం అయితే పింఛన్లు పెంచుతానని చెబుతున్నా, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు అందజేస్తున్నారని గుర్తుచేశారు.
అసత్య ప్రచారాలపై స్పందన కాంగ్రెస్ పార్టీ అప్పులపై అసత్య ప్రచారాలు చేస్తోందని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి 40 వేల కోట్ల అప్పులు మాత్రమే చేసిందని, కాంగ్రెస్ హయాంలో ఏడాదికి లక్షా 40 వేల కోట్ల అప్పులు జరిగాయని పేర్కొన్నారు.
కేటీఆర్‌కు మద్దతు లగచర్ల గిరిజన రైతులకు కేటీఆర్ అండగా నిలిచారని హరీష్ రావు ప్రశంసించారు. కేటీఆర్‌కు ఆపద వచ్చినప్పుడు బీఆర్ఎస్ మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతున్నందువల్లే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
సంక్షేమ పథకాలకు నిధుల ఎక్కడ? “బడా కాంట్రాక్టర్లు, ఢిల్లీకి మూటలు పంపడానికి నిధులు ఉన్నాయా? సంక్షేమ పథకాలకు మాత్రం పైసా లేదు,” అంటూ హరీష్ రావు కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీశారు.
ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతో మరింత దూకుడుగా వ్యవహరించనుందని స్పష్టమైంది.
YS Jagan: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు ఒకలా.. ఇకపై మరోలా చూస్తాం..