Thatikonda Rajaiah : ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదనడం కడియం దివాలాకోరుతనమని తాటికొండ రాజయ్య మండిపడ్డారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను.. కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటని, కడియం మాటలు..అబద్దాల మూటలు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఘనపూర్ కు ఇరిగేషన్ పనులు మంజూరయ్యాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియంను గెలిపిస్తే..రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, సక్రమ సంబంధం అయితే.. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు తాటికొండ రాజయ్య. కడియం నిజ స్వరూపం తెలిసే…కాంగ్రెస్ నాయకులు ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారని, దేవాదుల పథకానికి కడియం శ్రీహరి వ్యతిరేకమన్నారు. దేవాదుల సృష్టికర్త కాదు, దేవాదుల వ్యతిరేక కర్త అని, ధర్మసాగర్ సౌత్ కెనాల్ నుండి నీరు విడుదల చేయొద్దని, గేట్ల తాళాలు నీటిలో వేసిన ఘనుడు కడియమన్నారు తాటికొండ రాజయ్య.
VD 12: జెర్సీ చేసిన డైరెక్టరేనా? వీడీ 12 చూసి షాక్.. హైపెక్కించేస్తున్న నాగవంశీ
అంతేకాకుండా..’దేవాదుల ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి తీసింది లేదు. దేవాదుల ప్రాజెక్టులో నీటిని నింపిన చరిత్ర నాది. బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం.. ఘనపూర్ ను తాకట్టు పెట్టిన కడియం. నువ్వు పనులు చేయకుండా..గత ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు. ఇరిగేషన్ రంగాన్ని మొదటి దశలో ఉంచిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది. లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతు అకౌంట్లలో జమ చేసిన ఘనత బీఆర్ఎస్‌ది. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేసు లో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈడి, ఎసిబి నోటీసులు పంపడం విడ్డూరం. అక్రమ కేసులు, నిర్భందాలు, ఎంకౌంటర్లు కడియం ప్రత్యేకత. నియోజకవర్గానికి కడియం చేసింది గుండు సున్న. మాట్లాడేటప్పుడు కడియం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.
మరోసారి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే… తాట తీస్తాం.’ అని తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
US: విషాదం.. భోజనం చేస్తుండగానే యూఎస్ ఇన్‌ఫ్లుయెనర్స్ హఠాన్మరణం