Nitya Pellikoduku : మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కేసు వివరాలు: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ గబ్బిబాల్‌పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల […]
మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య.. దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళకి హాజరయ్యారు. అయితే, ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆంమె అలెర్జీతో బాధపడుతున్నారు. అయినప్పటికీ గంగా నదిలో పవిత్ర స్నానం చేసే ఆచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాసానంద గిరి మంగళవారం మాట్లాడుతూ.. ఆమె పవిత్రస్నానంలో పాల్గొంటారని, శిబిర్‌లో […]
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన పరిధిని దాటిన ప్రవర్తనతో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేసీఆర్ కౌశిక్‌రెడ్డిని అదుపులో ఉంచాలని సూచించారు. కొంపల్లి దేవరయాంజాల్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం తగదని స్పష్టంచేశారు. దాడులు, దురుసుగా ప్రవర్తించడం తెలంగాణ సంస్కృతి కాదని, […]
Double Murder : సంక్రాంతి పండుగ వేళ నార్సింగి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పుప్పాల్‌గూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనతో నార్సింగి పరిసర ప్రాంతాల్లో తీవ్ర సంచలనం రేగింది. సంక్రాంతి సందర్భంగా పలు చిన్నారులు, యువకులు కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లారు. గాలిపటాలు ఎగురుతుండగా, అవి తెగి పొదల్లో పడటంతో అక్కడి యువకులు వాటిని తీసుకునేందుకు వెళ్లారు. అయితే, పొదల్లోకి […]
UGC NET 2025 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో జరుగుతున్నాయి. జనవరి 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16 వరకు కొనసాగనున్నాయి. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగవలసిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్టీయే పేర్కొంది. జనవరి 16న నిర్వహించవలసిన పరీక్ష మాత్రం […]
KTR : తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది , జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం రేపు (బుధవారం) విచారణ జరపనుంది. ఈ కేసు సుప్రీంకోర్టు కోర్ట్ […]
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమని, ప్రశ్నిస్తున్న ప్రజా […]
Harish Rao : గ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్త.. ఎకరం లోపు భూమి ఉన్నవారిని కూలీలుగా గుర్తించి 12 వేలు ఇవ్వాల్సిందే అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ధికమంత్రి భట్టి గోబెల్స్ ని మించిపోతున్నారని, పూటకో తీరు ఆయన మాట్లాడుతున్నారన్నారు. నిన్న నాగర్ కర్నూల్ లో BRS హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారని, మేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు […]
రోజా అన్నీ గాలి మాటలు మాట్లాడుతుంది.. మంత్రి విమర్శనాస్త్రాలు మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదని పార్టీలో అందరూ మారుతున్నారని తెలిపారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులు అందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు.. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ పునరుద్ధరించాం.. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు […]
Padi Kaushik Reddy: తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. సంక్రాంతి పండగ సందర్భంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం తీవ్ర రసాభాసకు దారితీసింది. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి తనను దూషించడమే కాకుండా దాడి చేయడానికి ప్రయత్నించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు […]