GHMC : ఆస్తిపన్ను బకాయిలపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం..
- జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం
- 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం
- ఇప్పటివరకు దాదాపు రూ.1416 కోట్ల మేరకు మాత్రమే వసూలు
- ఇంకా 5 లక్షల మంది భవన యజమానులు బకాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC : హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఇప్పటివరకు దాదాపు రూ.1416 కోట్ల మేరకు మాత్రమే వసూలైంది. ఇప్పటివరకు 12 లక్షల మంది తమ ఆస్తిపన్ను చెల్లించగా, ఇంకా 5 లక్షల మంది భవన యజమానులు బకాయి కట్టాల్సి ఉంది. వీరి నుంచి సుమారు రూ.684 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది.
మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, వసూళ్ల పెంపు లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ పథకం కింద 90% వడ్డీ రాయితీ కల్పించాలని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వం అనుమతి కోరనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కమిషనర్ ఇలంబర్తి పరిశీలనలో ఉంది.
Tamilnadu : కదులుతున్న రైలులో గర్భిణీ స్త్రీపై అత్యాచారం.. తర్వాత బయటకు తోసేశారు
Also Read
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5000 కోట్ల వరకు ఆస్తిపన్ను బకాయిలు ఉన్నట్లు అంచనా. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలే రూ.3000 కోట్లు ఉంటే, మిగతా రూ.2000 కోట్లను సాధారణ ఆస్తిపన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా ఓటీఎస్ పథకానికి అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఓటీఎస్ అమలు అయినట్లయితే, బకాయిదారులు కేవలం 10% వడ్డీ మాత్రమే చెల్లించి తక్కువ ఖర్చుతో తమ ఆస్తిపన్ను రుసుమును పూర్తిగా తీర్చుకునే అవకాశాన్ని పొందనున్నారు.
జీహెచ్‌ఎంసీ గతంలో ఇప్పటికే మూడు సార్లు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని అమలు చేసింది. మొదటి విడత – 2020 ఆగస్టు 1 నుంచి నవంబరు 15 వరకు. రెండో విడత – 2022 జులై నెలలో. మూడో విడత – మునుపటి రెండు కార్యక్రమాలను కలిపి దాదాపు రూ.700 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఓటీఎస్‌ను అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది బకాయిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
ఈ పథకానికి ప్రభుత్వ అనుమతి లభిస్తే, ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తక్కువ వడ్డీతో బకాయిలను క్లియర్ చేసుకునే వీలుంటుంది. ఇది ఒక వైపు ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా, జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయాన్ని అందించనుంది.
VC Sajjanar : క్షేత్ర స్థాయి ఉద్యోగులు, అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వర్చువల్ సమావేశాలు
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!