Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్న భారం ఎవరీ మీద లేదన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వండని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండి కూడ ఒక్క ఎకరానికి నీళ్లు లేవన్నారు. ఖమ్మం జిల్లాలో 10 నియోజక వర్గాలకు గోదావరి జలాలు అందించాలనేది నా కోరిక అని, కరువు వచ్చినా కాటకాలు వచ్చినా ఖమ్మం 10 నియోజక […]
MLA Sanjay : కరీంనగర్లో ఆదివారం జరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్టేట్మెంట్ని రికార్డు చేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. నిన్న జరిగింది అధికారిక సమావేశమని, నన్ను కౌశిక్ రెడ్టి చేతితో దొబ్బేసాడన్నారు. నిన్నటి మీటింగ్‌లో కౌశిక్ రెడ్టి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. నిన్నటి సమావేశంలో కౌశిక్ నన్ను నెట్టివేసాడని, కౌశిక్ రెడ్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్.? అని ఆయన […]
HYD: పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్‌ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది. […]
హైదరాబాద్‌లో ఘనంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. సంక్రాంతి పండగా సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కైట్ ఫెస్టివల్ లో 19 దేశాల నుంచి 47మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. మన దేశంలో 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్ లో పాల్గొననున్న 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ […]
Viral Video : సంక్రాంతి పండుగకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిగా జరుపుకునే ఈ పంట పండుగను తమిళనాడులో పొంగల్‌గా 4 రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ కోసం భారీ సన్నాహాల మధ్య, ఇక్కడ చెస్ ఛాంపియన్లు పొంగల్ వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేసిన అందమైన వీడియో వైరల్ అవుతోంది. అవును, పొంగల్ వేడుకకు హాజరైన విశ్వనాథన్ ఆనంద్, డి. గుకేష్, ఆర్. ప్రజ్ఞానంద్.. ఇతర చెస్ ఛాంపియన్లందరూ పంచె ఉట్టు డ్యాన్స్ చేశారు. […]
India-Bangladesh Border : భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్‌పై ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను ఢాకాకు పిలిపించడంతో ఈ వివాదం మరింత ముదురింది. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మహ్మద్ జాషిమ్ ఉద్దీన్ సరిహద్దు ఫెన్సింగ్‌పై తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇరుదేశాల సరిహద్దులో ఐదు చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న […]
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న నాయకుడిగా నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన వాగ్వాదాలు, వారిపై సవాళ్లు విసిరి ప్రాచుర్యంలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో జరిగిన అధికారిక కార్యక్రమంలో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వివాదం […]
Gangula Kamalakar : నిన్న జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్ లో ఫెయిల్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం […]
Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన, మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి […]
Ponguleti Srinivas Reddy : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణం చేస్తున్న కారుకి ఒకేసారి రెండు టైర్లు ప్రేలడం తో డ్యూటీలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాక చక్యం తో ప్రమాదాన్ని తప్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం ఖమ్మం నుంచి వరంగల్ జిల్లాలో ఇన్చార్జి మంత్రి హోదా లో పర్యటనలో పాల్గొనేందుకు వెళ్లారు తిరిగి వస్తుండగా తిరుమలాయపాలెం సమీపంలో కారు రెండు టైర్లు బారెస్ట్ అయ్యాయి. అయితే […]