IT Raids : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో భారీగా ఆదాయపు పన్ను (ఐటీ) అధికారుల సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు, చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు చేపట్టింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. ఈ దాడులలో ఇప్పటి వరకు 40 కేజీల బంగారం.. 100 కేజీల వెండి.. 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, […]
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ (TSPSC) వరుసగా ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో, మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) ఉద్యోగ రాత పరీక్షల తుది ఫలితాలు ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్సైట్ (www.tspsc.gov.in) ద్వారా చూడవచ్చు. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉంది. అలాగే, ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో […]
రానికి చెందిన ప్రముఖ సంస్థ ముకుంద తమ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు ప్రత్యేకంగా వాహనాలను బహుకరించింది. ఈ సందర్భంగా 20 మంది ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, ఇద్దరు ఉద్యోగులకు హై-రేంజ్ కార్లు అందజేశారు. బేగంపేటలో నిర్వహించిన వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ నికిత రెడ్డి వాహనాలను ఉద్యోగులకు అందించారు. అలాగే, ఉద్యోగుల కృషిని గౌరవిస్తూ ఒక నెల వేతనంతో కూడిన చెక్కులను బహుమతిగా ఇచ్చారు. వేడుకల్లో ముకుంద యాజమాన్యం ఉద్యోగులను ప్రత్యేకంగా సన్మానించగా, […]
Bandi Sanjay : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే…డొల్ల అని తేలిపోయింది. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే […]
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల దుర్వినియోగంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హెచ్‌సీఏ నిధుల అక్రమ లావాదేవీలకు సంబంధించి ఈడీ తాజాగా కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. హెచ్‌సీఏలో కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో (Quid pro quo) వ్యవహారం చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్‌పై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సురేందర్ అగర్వాల్ తన హోదాను ఉపయోగించి హెచ్‌సీఏ […]
Harish Rao : మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా, పూర్తిగా అబద్దాలతో నిండిన బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రసంగాన్ని విమర్శిస్తూ, అది బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలా మారిపోయిందని అన్నారు. హరీష్ రావు ప్రకారం, బడ్జెట్లో పేర్కొన్న అనేక విషయాలు నిజాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా, వడ్డీ లేని రుణాల […]
CP Sudheer Babu : రాచకొండ పోలీసులు చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. అంతేకాకుండా, దత్తత తీసుకున్న 18 మంది పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పిల్లల అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుసంధానంలో ముఠాలో ప్రధానంగా అమూల్య అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు […]
KTR : తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసును కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, ఇరువురి వాదనలు పరిశీలించి ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై కేసు నమోదు జరిగింది. ఈ వ్యవహారంపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ కేసులో సరైన […]
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో 2020 మార్చిలో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. జన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డి సహా మరికొందరిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ కేసును ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి తరఫు […]
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఈ నెల 18న ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి రాజధాని (Amaravati) అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోడీని అధికారికంగా […]