CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఈ నెల 18న ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి రాజధాని (Amaravati) అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోడీని అధికారికంగా […]
Weather Updates : తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. తెల్లవారుజామునే ఎండలు మండి పడటంతో ప్రజలు దైనందిన పనులు చేసుకోవడానికే ఇబ్బందిపడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాలులతో ఉక్కిరిబిక్కిరి తీవ్ర వేడి ప్రభావంతోపాటు వడగాలులు […]
ట్రంప్ నా కోసం తన సెక్యూరిటీని పక్కన పెట్టేశారు.. మోడీ కామెంట్స్.. అమెరికన్ పాడ్‌కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్‌తో కలిసి స్టేడియంలో తిరగడం […]
Jagga Reddy : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఆయన తన సినీ ప్రయాణం, రాజకీయ భవిష్యత్తు, అభివృద్ధి పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, మూడు నెలల క్రితం దర్శకుడు రామానుజం తన వద్దకు వచ్చి, ఒక ఫోటో చూపించారని చెప్పారు. ఆ ఫోటో చూసిన వెంటనే తనకు కనెక్షన్ కలిగిందని, 2013 నుంచి దర్శకుడు తనలాంటి వ్యక్తిని వెతుకుతున్నారని చెప్పాడని వెల్లడించారు. మొదటగా సినిమాకు సమయం ఇవ్వలేనేమో అనుకున్నా, […]
MLC Kavitha : నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని […]
Kadiyam Srihari : కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం రూ.800 కోట్లు మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయానికి ప్రజల ఆదరాభిమానాలే కారణమని, ప్రతిపక్షంలో అభివృద్ధి కష్టమని గ్రహించి కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కింద 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, ఇంకా పెంచాలని సీఎం ప్రత్యేక నిధుల నుంచి మరిన్ని ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. గత 15 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని, […]
CM Revanth Reddy : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై ఎవరి వద్ద అయినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. పిల్ల కాకులకేం తెలుసు… వాళ్లు వీళ్లు కాదు, కేసీఆర్ నువ్వే రా అంటూ కౌంటర్ ఇచ్చారు. 2023లో ప్రజలు కాంగ్రెస్ […]
తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ ఆగ్ని ప్రమాదం.. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి ఒకటి, రెండు యూనిట్ల కూలింగ్ రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గదిలోని విద్యుత్ తీగలు కాలిపోయి ధ్వంసమయ్యాయి. అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు18 కు పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఫైర్ సిబ్బంది […]
Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకులు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ దోచుకున్న డబ్బులతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్లు బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని, ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ను రెండు సార్లు తిరస్కరించారని స్పష్టం చేశారు. అయినా వాళ్లకు బుద్ధి రావట్లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు […]
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఈ ప్రాంతం గొప్ప చైతన్యంతో కూడినదని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లావాసులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వరంగల్ అభివృద్ధికి రూ. 6,500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. […]