Ronald Rose : సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్‌కు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (CAT) పెద్ద ఊరట ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం ఆయన తెలంగాణలోనే కొనసాగేలా అవకాశం కల్పిస్తూ క్యాట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన అనంతరం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) రోనాల్డ్ రోస్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఏపీలో రిపోర్ట్ చేసినా, తర్వాత కొన్ని కారణాలతో మళ్లీ తెలంగాణకు రాగా, తిరిగి ఇటీవల తన బదిలీపై రోనాల్డ్ క్యాట్‌ను ఆశ్రయించారు.
తనకు తెలంగాణ రాష్ట్రంలో సేవల కొనసాగింపునకు అవకాశం కల్పించాలని, DoPTను ఆదేశించాలని కోరుతూ రెండోసారి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్ తాజాగా రోనాల్డ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నిబంధనలను పరిశీలించిన అనంతరం, రోనాల్డ్ రోస్‌కు తెలంగాణలో కొనసాగేందుకు అనుమతినిచ్చేలా DoPTకు ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా రోనాల్డ్ రోస్‌కు సర్వీసులో కొనసాగే మార్గం సులభమైంది.
ఈ పరిణామం ప్రస్తుతం తెలంగాణ పాలన వ్యవస్థలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. విభజన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులు అనేక వివాదాలకు దారి తీసిన సందర్భంలో, ఈ కేసు మరో మలుపు తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
Manchu Manoj: కన్నప్ప సినిమాకు భైరవం పోటీ.. ఇదెప్పుడు జరిగింది?