Komatireddy Rajgopal Reddy: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరగింది. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భువనగిరి పార్లమెంటు స్థానం విజయంలో కీలక పాత్ర వహించానని, తాను ప్రచార బాధ్యతలు చేపట్టినద్వారా కాంగ్రెస్ పార్టీ […]
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ […]
Violence : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీటుపీజీ క్యాంపస్‌లో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగరీత్యా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు దేవరాజు ఒకటో తరగతి చదువుతోన్న బాలుడు లవన్ సాయి కుమార్‌పై శారీరక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థి తరగతిలో అల్లరి చేశాడనే కారణంతో ఉపాధ్యాయుడు అతని వీపుపై బలంగా కొట్టినట్టు సమాచారం. ఇంటికి చేరిన బాలుడి పైన గాయాలను గమనించిన తల్లి, వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు. అయితే […]
CM Revanth Reddy :అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని.. అర్హులనే ఎంపిక చేయాలని సీఎం అన్నారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని సీఎం రేవంత్ […]
గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. 12 మంది పోలీసులపై చర్యలు వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ ను వెంబడించడం, గుంటూరు చుట్టగుంట సెంటర్ లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్పీ కార్యాలయంలోకి […]
Viral : సాధారణంగా చిన్నారులు పరీక్షల సమయంలో తమ ఊహాశక్తిని ఉపయోగించి సమాధానాలు రాస్తుంటారు. అయితే ఒక్కోసారి వారి సమాధానాలు నవ్వించడమే కాక, సమాజాన్ని ఆలోచనలో పడేస్తాయి. అలాంటి ఒక సంఘటన చందుర్తి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. చదువులో భాగంగా జరిగిన ఆంగ్ల పరీక్షలో నాలుగో తరగతి విద్యార్థిని ఒకరికి “Write about your mother’s likes and dislikes” అనే ప్రశ్న వచ్చింది. అంటే “మీ అమ్మకు నచ్చినవి, నచ్చని విషయాలు రాయండి” […]
Bhu Bharati : భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భారతిని సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక […]
Ponguleti Srinivas Reddy : పద్మశ్రీ గ్రహీత, పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో మాట్లాడుతూ మంత్రి ఆయన మృతిని “చాలా దురదృష్టకరమైనది, బాధాకరమైనది” అన్నారు. “పద్మశ్రీ వనజీవి రామయ్య మనకు కనిపించనంతగా దూరమయ్యారు. ఇది మనం తట్టుకోలేని నష్టం,” అని మంత్రి అన్నారు. ప్రభుత్వ […]
అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరి విధ్వంసం.. పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో […]
Tragedy : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆదివారం దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పరిస్థితి ఒక విషాద ఛాయను సంతరించుకుంది. నిర్లక్ష్యపు నిమిషాలు అమూల్యమైన ప్రాణాన్ని బలిగొన్నాయి. కేవలం 21 నెలల బాలుడు కార్పెంటైన్ ఆయిల్‌ను మంచినీళ్లుగా పొరపడి తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన గ్రామస్థులను విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన ధన్వాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోడ మమత, ఆమె భర్త నరేష్ కుటుంబంలో చోటు చేసుకుంది. […]