CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల కలను సాకారం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం 12 మంది లబ్ధిదారులకు లాంఛనంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రూ. 20.19 కోట్లను 2,019 మంది లబ్ధిదారులకు విడుదల చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద […]
Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “మేము 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, […]
Kotha Prabhakar Reddy : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి తన దూకుడు వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యారు. NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, పార్టీ నేతలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చమని మా నాయకుడు కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు. అలాగే మేము కూడా ప్రభుత్వాన్ని కూల్చే […]
Inter Results : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగించబడ్డాయి, మరియు ఇప్పుడు విద్యార్థులు ఫలితాలను కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సమయంలో, విద్యార్థుల మనసులో టెన్షన్ పెరిగిపోతున్నది, అలాగే వారు ప్రశాంతంగా విరామం తీసుకోవాలని కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం, పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మూల్యాంకనంలో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక, ఫెయిల్ అయిన విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మరోసారి వేరిఫై చేయడం జరుగుతుంది. […]
Minister Seethakka : వేసవి దాహాన్ని తీర్చేందుకు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, మండల కేంద్రాల్లో భారీ సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8,090 చలివేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వేసవి కాలంలో పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ చర్యలు చేపట్టబడ్డాయి. మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలతో పీఆర్ఆర్డీ అధికారులు గ్రామాల నుంచీ రద్దీ ప్రాంతాల వరకు ప్రతి చోట చలివేంద్రాలను […]
CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. ఇటీవల ఎంపీ చామల, రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ వస్తున్న వ్యాఖ్యలు పార్టీకి మంచి పేరు తీసుకురావని సీఎం హెచ్చరించారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, ఈ అంశంపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని రేవంత్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, […]
MLC Kavitha : బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు సమాచారం ఉందని ఆమె చెప్పారు. “ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం,” అంటూ హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదని, పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కవిత, కాంగ్రెస్ నాయకులపై కూడా విమర్శల వర్షం […]
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతారన్న ఊహగానాలను కొట్టి పడేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి… వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా… జానారెడ్డి కూడా నా తర్వాత పార్టీ లో నాలుగు సంవత్సరాల తర్వాత చేరాడని, పార్టీలో భిన్న […]
Telangana : విద్యార్థుల కోసం నిజంగా ఇది పండుగల వారం! ఇప్పటికే శనివారం (రెండో శనివారం) , ఆదివారం సెలవులతో సరదాగా గడుపుతున్న పిల్లలకు మరో శుభవార్త వెల్లడైంది. సోమవారం (ఏప్రిల్ 14) కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనితో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల విశ్రాంతి లభించబోతోంది. ఈ సెలవు ప్రత్యేకత ఏంటంటే… ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర […]
Old City Metro : మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో విస్తరణ పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకుని, కూల్చి వేసే కార్యక్రమం స్థానికుల పూర్తి సహాయ సహకారాలతో ముమ్మరంగా సాగుతోందని ఆయన చెప్పారు. మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తుల ఉండగా ఇప్పటి వరకు ఈ మార్గంలో […]