Tragedy : పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వధువు మృతి
- హల్దీ వేడుకలో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ వధువు హఠాన్మరణం
- ఆసుపత్రికి తరలించినా నిలవని ప్రాణాలు
- పెళ్లి పల్లకిలో కాదు.. పార్థివ దేహంతో అంతిమయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతుండగా వధువు మరణించింది. తన హల్దీ వేడుకలో నృత్యం చేస్తూ ఉండగా, బాత్రూమ్‌కు వెళ్లిన 22 ఏళ్ల యువతి గుండెపోటుతో మృతి చెందింది. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి బాత్‌రూమ్‌లో ప్రాణాలు విడిచింది. ఈ వేడుకలో యువతి నృత్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషాదకర సంఘటన ఆదివారం (మే 4) రాత్రి బదౌన్ జిల్లాలోని ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ పినోని గ్రామంలో చోటుచేసుకుంది. వధువు, ఆమె కుటుంబ సభ్యులు తమ జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఒకటైన పెళ్లి కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. అప్పుడే హల్దీ కార్యక్రమం పూర్తయింది. ఇల్లంతా నవ్వులు, సంగీతం, నృత్యాలతో కళకళలాడుతోంది.
NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
హల్దీ వేడుక ముగిసిన తర్వాత, వధువు తన స్నేహితులు, బంధువులతో ఆనందంగా నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్నవారు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, యువతిని రక్షించలేకపోయారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు గుండెపోటు వచ్చి ఉండవచ్చని వైద్యులు తెలిపారు.
నేడు ఉదయం వరుడి పెళ్లి ఊరేగింపు (బారాత్) రావలసి ఉంది. పెళ్లికి వధువును అందంగా అలంకరించిన పల్లకిలో పంపించాల్సిన చోట, ఆమె పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం మోసుకెళ్లాల్సి వచ్చింది. వధువు హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె తల్లి షాక్ , దుఃఖంతో స్పృహ కోల్పోయింది. పెళ్లికి హాజరయ్యేందుకు పట్టు వస్త్రాలు ధరించి వచ్చిన బంధువులు అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక నివాసి ఒకరు మాట్లాడుతూ, “ఆ అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఆమెకు ఇలాంటి దురదృష్టకర మరణం సంభవిస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు” అని అన్నారు.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!