Viral : ఐస్‌క్రీమ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఈ వేసవిలో అది ఒక హాయిని, ఆనందాన్నిచ్చే తియ్యటి పదార్థం. రకరకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు ఐస్‌క్రీమ్‌లను కారం లేదా వేడి వంటకాలతో కలిపి తింటున్నారు. ఇలాంటి అనేక వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా, సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్‌తో ఆలూగడ్డ ఫ్రైస్ వేసుకొని తింటున్న వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఇది నిజంగా విచిత్రమైన కాంబినేషన్. తీపి, చల్లదనం, ఉప్పు, వేడి అన్నీ ఇందులో కలిసి ఉంటాయి. అంతేకాదు, ఈ ఐస్‌క్రీమ్ గరిష్టగా కూడా ఉంటుందట. ఈ వీడియోను @digitaldiarylondon అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వింత రుచి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకుముందు వెనిల్లా ఐస్‌క్రీమ్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకుని తిన్న వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగా ఆలూగడ్డ క్రిస్పీ ఫ్రైస్‌ను ఐస్‌క్రీమ్‌తో కలిపి తింటున్న వీడియో వైరల్ అవుతోంది. లండన్‌లోని చిన్ చిన్ ఐస్‌క్రీమ్ అనే రెస్టారెంట్‌లో ఈ విచిత్రమైన వంటకాన్ని తయారు చేస్తున్నారు. దీన్ని ఒక కొత్త తరహా ఐస్‌క్రీమ్‌గా చెబుతున్నారు. ఒకవేళ మీకు ఫ్రైస్ , వెనిల్లా సాఫ్ట్ సర్వ్/మిల్క్‌షేక్ విడివిడిగా తినడం ఇష్టం లేకపోతే, ఈ విధంగా ప్రయత్నించవచ్చు అంటున్నారు. దీన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఇది చాలా సులభం కూడా.
ఐస్‌క్రీమ్ , ఆలూగడ్డ ఫ్రైస్.. ఇది ఎలాంటి కాంబినేషన్ అని మీకు అనిపించవచ్చు. కానీ, కొందరికి ఇలాంటి వింత కలయికలు ఇష్టంగా ఉంటాయి. ఈ విషయంపై నెటిజన్లు ఏమంటున్నారో చూడండి. ఒక యూజర్, “ఫ్రైస్ తినడానికి ఇదే నా అభిమాన పద్ధతి!” అని కామెంట్ చేశారు. మరొకరు, “ఇది చాలా బాగుంది” అని అన్నారు. “ఖచ్చితంగా ప్రయత్నిస్తాను!! ఉప్పు , తీపి చాలా బాగుంటాయి” అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. “నిజంగా దీన్ని ప్రయత్నిస్తాం” అని మరికొందరు అంటున్నారు. ఈ వీడియోను ఏప్రిల్ 23న షేర్ చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు 12,749 లైక్‌లు వచ్చాయి.
Mock drill: పాక్ కు చెమటలు పట్టిస్తున్న భారత్.. దేశవ్యాప్తంగా రేపు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్..