ఇకపై ఏది ఫ్రీ కాదు.. ప్రపంచ వాణిజ్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా కీలక వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వాణిజ్య ఆంక్షలు మరింత తీవ్రతరం కావడంతో భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించాడు. అలాగే, రష్యా నుంచి చమురు దిగుమతిని సాకుగా చూపించి భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ తాజా పరిస్థితిపై ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ (IEC) 2025లో […]
Panchayat Elections Live Updates: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు భవితవ్యం తేలనుంది.
Telangana Thalli Statue : భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో జరుగుతున్నది అంతా అసత్య ప్రచారమని, వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. […]
కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, రైతుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ ప్రాంతాల నుంచి మైదానంలోకి వచ్చిన ఈ పెద్దపులి కారణంగా సమీప మండలాల్లో అలజడి నెలకొంది. భిక్కనూరు మండలం, పెద్దమల్లారెడ్డి ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు ధృవీకరించారు. దీనితో పాటు, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పెద్దపులి తన ఉనికిని చాటుతూ కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడు లేగదూడలపై […]
నేడు చివరి విడత ఎన్నికల పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..! తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు […]
Accident : మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని బలిగొంది. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారు, మైలార్‌దేవ్‌పల్లి వద్ద నియంత్రణ కోల్పోయి బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పి నేరుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించుకుంటూ అక్కడే నిద్రిస్తున్న ఓ […]
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలిదశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు […]
Telangana : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్నప్పటికీ, పాలమూరు (నాగర్‌కర్నూల్) జిల్లాలోని ఆరు గ్రామాల్లో మాత్రం ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఈ గ్రామాలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నికలను బహిష్కరిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలం పరిధిలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు డిండీ నార్లాపూర్ ఎత్తిపోతల పథకం కింద నిర్మించ తలపెట్టిన జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయంతో ఎన్నికలను బహిష్కరించారు. Taj Mahal Disappears in […]
IBomma Ravi : తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ల నిర్వాహకుడు బోడపాటి రవి అలియాస్ ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ మంజూరు చేయాలని రవి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పూర్తిగా కొట్టివేసింది. మంగళవారం నాంపల్లి కోర్టులో జరిగిన విచారణలో, నిందితుడు ఐబొమ్మ రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రవిపై నమోదైన నాలుగు వేర్వేరు కేసులలో, ఒక్కో కేసులో […]
MLA Madhavaram: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ, హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ఐడీపీఎల్ (IDPL) భూముల వ్యవహారంపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కూకట్పల్లి ప్రాంతంలోని సర్వే నంబర్ 376లో ఉన్న సుమారు 8 వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములు కబ్జాలకు గురయ్యాయన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. వాస్తవానికి, పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించిన ఈ ఐడీపీఎల్ భూములు కబ్జాలకు గురయ్యాయని, పలువురు రాజకీయ […]