Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 01 02 2026

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 1, 2026 , 9:14 pm
By Gogikar Sai Krishna
  • టాలీవుడ్‌లో విషాదం.. కొడుకు చనిపోయిన నెల రోజులకే తెలుగు నటుడు మృతి
  • శాంతి దిశగా అడుగులు.. వచ్చే వారం రష్యా-ఉక్రెయిన్ చర్చలు!
  • అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్‌.. కీలక ఆదేశాలు జారీ
  • తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో మొండిచేయి.. మేం చేసిన తప్పేంటి.? భట్టి ఫైర్..!
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో విషాదం.. కొడుకు చనిపోయిన నెల రోజులకే తెలుగు నటుడు మృతి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తన విలక్షణ నటనతో వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి (72) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. నెల రోజులక్రితమే ఆయన కొడుకు గుండెపోటుతో మరణించడం వల్ల అదే బెంగతో ఆయన కూడా గుండెపోటుతో మరణించారని సినీ వర్గాల సమాచారం. ఆయన తెలుగు, హిందీ, తమిళ్, బోజ్పురి భాషల్లో 370కి పైగా సినిమాలు, సీరియళ్లలో కీలక పాత్రలు పోషించి వెండి తెర, బుల్లి తెరపై ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. రఘునాథ్ రెడ్డి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Also Read

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

హైదరాబాద్‌ ఊపిరి ఆగుతోంది.. బాం*బు పేల్చిన IIT కాన్పూర్ అధ్యయనం!

మనకు కనిపించదు. వాసన కూడా ఉండదు. కానీ అది ప్రతి ఊపిరితో శరీరంలోకి వెళ్తోంది. హైదరాబాద్ గాలి ఇప్పుడు మనుషులను సైలెంట్‌గా చంపుతున్న ఆయుధంగా మారుతోంది. ఇది పొగమంచు కాదు.. ఇది మామూలు కాలుష్యం కూడా కాదు. ఇది నెమ్మదిగా పనిచేసే విషం. అదే సల్ఫర్ డయాక్సైడ్.. దాన్నే SO2 అని పిలుస్తారు. మనం పీల్చుకునే గాలిలో విషపూరిత వాయువు ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలు ఈ భయంకర దాడికి కేంద్రాలుగా మారుతున్నాయి. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు కలసి ఇప్పుడు మన ఊపిరిని లక్ష్యంగా చేసుకున్నాయి. దీని ప్రభావం వెంటనే కనిపించదు కానీ ఇకపై శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఆస్థమా, శ్వాసకోశ వ్యాధులు మెల్లగా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి.

9 ఏళ్లుగా లవ్.. 2 నెలల క్రితం పెళ్లి.. శవమైన భర్త.. మిస్టరీ ఏంటంటే..!

వాళ్లిద్దరూ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి ప్రేమ ఫలించి రెండు నెలల క్రితం ఏడడుగులు వేశారు. ఇంతలోనే ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ భర్తను ఇల్లాలు కాటికి పంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి. జితేంద్ర కుమార్ యాదవ్, జ్యోతి 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి కుటుంబ సభ్యుల అంగీకారంతో నవంబర్ 25, 2025న బరేలీలో వైభవంగా వివాహం జరిగింది. అయితే జితేంద్ర కుమార్ యాదవ్ ఆన్‌లైన్ జూదానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య జ్యోతి బ్యాంక్ ఖాతా నుంచి 20 వేలు విత్‌డ్రా చేసి ఆన్‌లైన్‌లో పెట్టాడు. అవి కాస్త పోయాయి. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరికి అది కాస్త హత్యకు దారి తీసింది.

ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు.. జోగి రమేష్ ఫైర్

మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డాయి. ఆయన నివాసానికి నిప్పు పెట్టి రాళ్లు రువ్వుతూ ఉద్రిక్త వాతావరణానికి తెరలేపాయి. ఈ ఘటనపై జోగి రమేష్ స్పందించారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారని ప్రశ్నించారు. నా ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేస్తారా? గంజాయి బ్యాచ్‌ను నా ఇంటిపైకి పంపుతారా.? అని ఫైర్ అయ్యారు. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఎప్పుడూ మీరే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారేమో. నీ పిల్ల చేష్టలు, క్షణికానందం మానుకో అంటూ జోగి రమేష్‌ మండిపడ్డారు. దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న జోగి రమేష్ తండ్రి జోగి మోహనరావు, సతీమణి జోగి శకుంతల దేవి , చిన్న కుమారుడు జోగి రోహిత్.

సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం సారూ.. 68 వేల మంది ఉద్యోగులకు ‘నో శాలరీ’..!

ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆస్తి వివరాలను కోరింది. కొందరు వివరాలను సమర్పించగా, 68 వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాన్ని పట్టించుకోలేదు. దీంతో సుమారు 68 వేల మంది ఉద్యోగుల జీతాలను యూపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను అందించే వరకు వారికి జీతాలు చెల్లించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఉద్యోగులందరు త్వరలో వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1956 ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలలోని 24వ నిబంధన ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8,66,261 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ 2025 సంవత్సరం వరకు తమ చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను ఈ ఏడాది జనవరి 31 నాటికి మానవ్ సంపద పోర్టల్‌లో సమర్పించాలి. ఇప్పటికే అన్ని విభాగాల నోడల్ అధికారులు, చెల్లింపు అధికారులకు ప్రభుత్వం తగిన సూచనలు జారీ చేసింది. జనవరి 31 నాటికి ఆస్తి వివరాలను అప్‌లోడ్ చేయని వారి జీతాలను కూడా నిలిపివేస్తామని ముందే స్పష్టం చేసింది.

సండే మూడ్‌ను.. మార్కెట్‌ను రెండూ నాశనం చేశారు.. నిర్మలమ్మ బడ్జెట్‌పై నెట్టింట విమర్శలు

ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కారణంగా మార్కెట్‌ కూడా సండే ఓపెన్ కావాల్సి వచ్చింది. ఇక బడ్జెట్‌లో ఏవైనా మెరుపులు ఉన్నాయంటే అది లేదు. పేదోడికి.. సామాన్యుడికి ఊరట కలిగించే ప్రకటనలు ఏవీ రాలేదు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకైనా తాయిలాలు ఉంటాయనుకుంటే అది లేదు. మరోవైపు స్టాక్ మార్కెట్ అయినా లాభాల్లో దూసుకెళ్లిందా? అంటే అది లేదు. పెట్టుబడిదారులకు బడ్జెట్ ఏ మాత్రం రుచించలేదు. దీంతో 8 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం పంచ్‌లు పేలుతున్నాయి. నిర్మలమ్మ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సండే మూడ్‌ను.. మార్కెట్‌ను రెండూ నాశనం చేశారంటూ ధ్వజమెత్తుతున్నారు. మధ్యతరగతి ప్రజల దుస్థితిపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. మధ్యతరగతి వారికి సెలవు లేదు.. బడ్జెట్ లేదు.. ఆదివారం సమయం వృధా అయిందని మరొకరు విమర్శించారు.

అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్‌.. కీలక ఆదేశాలు జారీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్‌ అయ్యింది. అంబటి భార్య హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతకు ముందు టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిపై దాడికి పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో మొండిచేయి.. మేం చేసిన తప్పేంటి.? భట్టి ఫైర్..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తామంతా ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ, ఒక్క విన్నపాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణ ఏం తప్పు చేసింది?” అని ప్రశ్నిస్తూ, కేంద్రం వివక్షాపూరిత వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో విస్తరణ, , మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల కోసం కేంద్రం నుండి భారీగా నిధులు అందుతాయని ఆశించామని భట్టి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం కేంద్ర సాయం కోరినప్పటికీ బడ్జెట్‌లో దాని ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రపంచానికే ఫార్మా హబ్‌గా ఉన్నప్పటికీ, కేంద్రం ప్రకటించిన కెమికల్ పార్కుల జాబితాలో తెలంగాణకు చోటు కల్పించకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ECIL వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు తెచ్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉన్నవాటిని కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కోట్ల విలువైన బడ్జెట్ 2026 ను రూపొందించిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఏ కారును ఉపయోగిస్తారంటే?

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానికి ముందు, ఆమె ఎలాంటి కారులో ప్రయాణించింది. ఆమె అధికారిక వాహనం ఏమిటి? ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఆ వివరాలు మీ కోసం.. బడ్జెట్ వేళ ఆమె తన ఇంటి నుండి తన కార్యాలయానికి, ఆపై రాష్ట్రపతి భవన్‌కు ప్రయాణించి పార్లమెంటుకు చేరుకున్నారు. పర్యటనలో, ఆమె తెల్లటి మారుతి సియాజ్‌లో ప్రయాణిస్తూ కనిపించింది. ఇది ఆర్థిక మంత్రి అధికారిక కారు, దీనిని అనేక మంది ఇతర రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు కూడా ఉపయోగిస్తున్నారు.

శాంతి దిశగా అడుగులు.. వచ్చే వారం రష్యా-ఉక్రెయిన్ చర్చలు!

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4-5 తేదీల్లో అబుదాబిలో రష్యా-ఉక్రెయిన్-అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశాలు జరుగుతాయన్నారు. ఉక్రెయిన్ అర్థవంతమైన సంభాషణకు సిద్ధంగా ఉందని చెప్పారు. గౌరవప్రదమైన ముగింపునకు ఆసక్తి కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు టెలీగ్రామ్ పోస్టులో జెలెన్‌స్కీ తెలిపారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • Jogi Ramesh
  • kcr
  • telugu news

తాజావార్తలు

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions