సైలెన్స్ వీడిన ధర్మాన.. కేడర్ లో ఉత్చాహం.. ఇదే ఊపు కొనసాగిస్తారా.. మరలా సైలెంట్ మోడ్ లోకి జారుకుంటారా.. ఇదే అంశం నేడు జిల్లా పార్టీలో ఆశక్తికర చర్చగా మారిందట. ఇంతకీ ఎవరా నేత. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా శ్రీకాకుళం జిల్లాలో అంతా తానై వ్యవహరించిన ధర్మాన ప్రసాద రావు…కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఈమధ్య మళ్లీ జిల్లా పార్టీ ప్రోగ్రామ్స్‌లో యాక్టివ్‌గా కనిపిస్తుండటంతో, అసలేం జరిగింది? మళ్లీ ఎందుకు యాక్టివ్ […]
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నవంబర్ 20న తిరుపతికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె 21న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.
ఉప ఎన్నికలో 25 వేల ఓట్లు వస్తే.. కిషన్ రెడ్డికి మరొకసారి పొన్నం ఛాలెంజ్! కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ […]
Delhi Science Tour : సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 52 మంది విద్యార్థులు న్యూ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను ఏపీ సైన్స్ సిటీ, సమగ్ర శిక్ష అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున ఎంపికైన విద్యార్థులు ప్రస్తుతం ఢిల్లీలో పలు సైన్స్ సంబంధిత కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఘజియాబాద్‌లోని కైట్ ఇంజనీరింగ్ కాలేజ్, మురాద్‌నగర్‌లో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్‌లో […]
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అంత దారుణంగా మారింది.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేని స్థితి. హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మా చేతుల్లో లాఠీలు ఉన్నాయా […]
మేకప్‌కు ప్యాకప్ చెప్పి….ప్రజాసేవకే క్లాప్ కొడతానన్న ఆర్కే రోజా….మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. మొన్నటి వరకు బుల్లితెరకే రీఎంట్రీ ఇచ్చిన రోజా…ఇప్పుడు ఏకంగా వెండితెరపై మళ్లీ మెరుస్తున్నారు. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత రోజా సినిమా సీక్వెల్ దేనికి సంకేతం? ఇక పాలిటిక్స్ కన్నా మూవీలే బెటరని ఆమె అనుకుంటున్నారా? క్యాడర్లో కన్ప్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? తెలుగు రాజకీయాల్లో ఆర్కో రోజా అంటే ఫైర్..ఫైర్ అంటే రోజా. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ […]
బతికున్నప్పుడు వేధింపులు…మరణం తర్వాతా సాధింపులా? ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుపై ఆ నియోజకవర్గంలో ఇలాంటి చర్చే జరుగుతోంది. అసలు ఆయన మరణానికీ ఎమ్మెల్యే మెంటల్ టార్చరే కారణమన్న కోపాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఏకంగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగినా….సయోధ్య కుదరలేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత ఆగ్రహం….అసహనం? నెల్లూరు రాజకీయాల కథే వేరు. చలికాలంలోనూ చెమటలు పట్టించేలా ఉంటాయి. ఇక్కడి నేతలు ప్రతిపక్ష నేతలతో పాటు.. సొంత పార్టీలో ఉండే నేతల ఎత్తులకు కూడా పైఎత్తులు వేస్తూ […]
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ (Data Driven Governance) అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు ఆయన సీరియస్ వార్నింగ్ జారీ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలపై సమీక్ష నిర్వహించిన సీఎం, పనితీరు మెరుగు పరచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ (Animal Husbandry) పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, “గత ఐదేళ్లలో పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పశువుల […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం […]
కేసీఆర్‌కు 40 లెటర్లు రాశాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్‌రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది […]