KTR : తెలంగాణలో పేదల ఇళ్లపై, పోడు భూములపై బుల్డోజర్ల దాడులు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పేదల ఇండ్లు కూల్చడం తర్వాత, ఇప్పుడు ఆదివాసీల పోడు భూములపైనా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్, “పేదలపైనా, అడవులపైనా ఇప్పుడు బుల్డోజర్లు దాడి చేస్తున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసి జీవిస్తున్న ఆదివాసీలపై పోలీసులు దాడి చేయడం అమానుషం” అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పేదల పట్ల మానవత్వం లేదు, ఆడబిడ్డల పట్ల కనికరం లేదు అని వ్యాఖ్యానించారు.
Mega Star : ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని మరిపించేందుకు బలవంతపు చర్యలకు దిగుతోందని కేటీఆర్ ఆరోపించారు. “హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో పేదల ఇండ్లను కూల్చడం మొదలై.. పరిశ్రమల పేరుతో లగచర్ల, దిలావర్‌పూర్, పెద్ద ధన్వాడ, చారగొండ, సిరసనగండ్లలో రైతుల భూములపైనా దాడులు జరుగుతున్నాయి” అని చెప్పారు. పట్నం, పల్లె తేడా లేకుండా బుల్డోజర్లను పంపి ప్రజలను బెదిరించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని కేటీఆర్ ఆగ్రహించారు. “ఇది కేవలం భూసేకరణ కాదు.. ప్రజల జీవనాధారాలపై కక్షసాధింపు చర్యలు. పేదల మీద కూల్చే, కాల్చే విధానాలే కాంగ్రెస్ పాలనకు గుర్తుగా మారుతున్నాయి” అని విమర్శించారు.
Israel Iran Conflict: ఇరాన్లోని సైనిక విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దాడి.. డైలామాలో టెహ్రాన్!