MIlk : కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అరుదైన కేసు నమోదైంది. సాధారణంగా చోరీలు, ఘర్షణలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులు వస్తుంటే… ఈసారి మాత్రం పాలు పగిలిపోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సంఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకుంది. బాధితులు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాకెట్ పాలలో మొదటి ప్యాకెట్ కాచినప్పుడు సాధారణంగానే కనిపించిందని, అయితే రెండవ ప్యాకెట్ కాచేసరికి పూర్తిగా పగిలిపోయిందని తెలిపారు. ఇది ఏంటని అడిగితే, దుకాణదారుడు బాధ్యత వహించలేమని తేల్చి చెప్పారు. దీంతో అసంతృప్తికి గురైన బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.
India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. ఎలా అంటే..?
విషయాన్ని గమనించిన కూకట్‌పల్లి పోలీసులు వినియోగదారుల పరిరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇదే కాక, ఇటీవల కాలంలో పలువురు వినియోగదారులు వివిధ బ్రాండ్ల పాలు పగిలిపోతున్నాయని, వాసన కూడా వస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాలు వంటి నిత్యావసర వస్తువులపై నాణ్యతకు సంబంధించి తగిన నిర్ధారణ, నియంత్రణ ఉండాలని వినియోగదారుల కోరిక.
Barqa Madan : గ్లామర్ ప్రపంచం వదిలేసి.. సన్యాసిగా మారిన RGV హీరోయిన్